* తాడేపల్లిలో కరోనా కలకలంగత 5 రోజుల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన 11 మందికి ఫ్లూ లక్షణాలు ఉండటంతో కరోనా అనుమానితులు కింద గుర్తించిన అధికారులువారి నివాసాల్లోనే హోమ్ ఐసోలేషన్ గది ఏర్పాటు చేసి ఆశా వర్కల ద్వారా వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వ డాక్టర్లువీరిని వార్డు వాలంటరీల ద్వారా గుర్తించి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించటంతో వారి నివాసాల్లోనే ప్రత్యేక గదుల్లో చికిత్స.వివరాలు గోప్యంగా ఉంచుతున్న, మున్సిపల్ అధికారులు, డాక్టర్లు.14 రోజులు వారిని పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలిపిన అధికారులురాజధాని ప్రాంతం కావటంతో ఇంకా విదేశాల నుంచి ఎవరెవరు వస్తున్నారో వెతికే పనిలో ఉన్న మున్సిపల్ సిబ్బందిఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చి చికిత్స పొందుతున్న వారిలో దుబాయ్ నుంచి 2, సౌదీ నుంచి 1, ఇటలీ నుంచి 2, నేపాల్ నుంచి 3, ఇజ్రాయెల్ నుంచి1,శ్రీలంక నుంచి 1,ఆస్ట్రేలియా నుంచి1,అమెరికా నుంచి1 తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నట్లు గుర్తించిన అధికారులు.
* కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా టోర్నీలు రద్దు కావడం లేదా వాయిదా పడడం జరుగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో జులై 24న టోక్యో ఒలింపిక్స్ ఆరంభమవుతాయా? లేదా? అనే అనుమానాలు వస్తూనే ఉన్నాయి.అయితే ముందుగా నిర్ణయించిన దాని ప్రకారమే ఒలింపిక్స్ జరిగి తీరుతాయని జపాన్ ప్రధాని షింజో అబె శనివారం స్పష్టం చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వాహకులను కోరిన సంగతి తెలిసిందే.
* చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది.దేశ వ్యాప్తంగా మొత్తం 107 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు ఈ మహమ్మారికి బలయ్యారు. ఇప్పటికే కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది కేంద్రం.మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో 59 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ఇప్పటివరకు అత్యధికంగా రాష్ట్రంలోనే 31 కేసులు నమోదయ్యాయి.మిజోరంలో 117 మంది కరోనా వైరస్ అనుమానితులను గుర్తించిన అధికారులు.. వారిని ఇళ్లలోనే నిర్బంధించారు.సోమవారం నుంచి కర్తార్‌పూర్ కారిడార్ పర్యటన, రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.దిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ సహా పలు రాష్ట్రాలు థియేటర్లు, పాఠశాలు, పబ్‌లను మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి.
* శ్రీశైలంలో అధికారులు కరోనా హై అలర్ట్ ప్రకటించారు.విదేశీ భక్తులు దర్శనానికి రావొద్దంటూ సూచించారు.ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.క్యూలైన్లలో భక్తులకు ఉచితంగా శానిటైజేషన్లు పంపిణీ చేశారు.కరోనాపై భక్తులు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఈవో విజ్ఞప్తి చేశారు.
* దేశ వ్యాప్తంగా కరోనా తన కోరలు చాచడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది.ప్రయాణికులు ఎవరికి వారే వారి సొంత బ్లాంకెట్లను తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేసింది.కరోనా వ్యాప్తి చెందడంతో ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు కర్టెన్లతో పాటు బ్లాంకెట్లను కలిపించే సదుపాయాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు రైల్వే పీఆర్వో ప్రకటించారు.ఏసీ బోగీల్లో వినియోగించే కర్టెన్లు, బ్లాంకెట్లను ఓ ట్రిప్ పూర్తి కాగానే ఉతికి శుభ్రపరచడానికి వీలుండదని, ఈ కారణంతో వైరస్ సోకే ప్రమాద ముందని ఆయన తెలిపారు.కేవలం బ్లాంకెట్లు మాత్రమే కాకుండా, ప్రయాణికులకు అవసరమైన దుప్పట్లు, ఇతరత్రా వాటిని ఎవరికి వారే తెచ్చుకోవాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
* కోవిడ్-19 విజృంభణతో యావత్ ప్రపంచం వణికిపోతోంది. 136 దేశాలకు విస్తరించిన ఈ ప్రాణాంతక వైరస్‌ను అంటువ్యాధిగా పరిగణించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ను ‘ప్రపంచ మహమ్మారి’గా ప్రకటించింది. ప్రాంతాలు దాటిన కరోనా ప్రపంచాన్ని కమ్మేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నిఘా, నియంత్రణ, నివారణతో వైరస్‌కు అడ్డుకుట్ట వేయొచ్చని వెల్లడించింది. ఈమేరకు ఏపీ కుటుంబ ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని వివరించారు.ఇప్పటివరకు వైరస్ అనుమానితులుగా పరీక్షలు జరిగినవారు 70 మందికరోనా పాజిటివ్ కేసుగా తేలింది 1నెగెటివ్‌గా నిర్ధారణ అయింది 57 మందిశాంపిల్స్ ఫలితాలు రావాల్సినవి 12ఇప్పటివరకు స్క్రీనింగ్ జరిగింది, పర్యవేక్షణలో ఉన్నవారి సంఖ్య: 777పర్యవేక్షణలో ఉన్న బాధితుల సంఖ్య 51228 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకున్న బాధితులు 244ఆస్పత్రి అబ్జర్వేషన్‌లో ఉన్నవారి సంఖ్య 21విజయవాడలో నిర్ధారణ పరీక్ష..1897 అంటువ్యాధుల చట్టం ప్రకారం కరోనా నియంత్రణకు జిల్లా కలెక్టర్లు, మెడికల్ హెల్త్ ఆఫీసర్లకు అధికారాలు ఇచ్చినట్టు ఏపీ కుటుంబ ఆరోగ్యశాఖ డైరెక్టర్ చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇక కోవిడ్-19 ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లను జిల్లా నోడల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం ప్రకటించిందని ఆయన తెలిపారు.సహాయ కేంద్రాలు.. జాగ్రత్తలు24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్. నెం.0866 2410978 ఏర్పాటు.కరోనాపై సమాచారం కొరకు 104 హెల్ప్ లైన్ (టోల్‌ఫ్రీ నెంబర్)కు ఫోన్ చేయొచ్చు.దగ్గినపుడు, తుమ్మినపుడు నోరు, ముక్కుకు చేతి రుమాలు, తువ్వాలు అడ్డుపెట్టుకోవాలి. చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవాలి. బాధ్యతగా ఉండాలి..కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారు వైరస్ లక్షణాలు ఉన్నా లేకున్నా 28 రోజులపాటు గృహ నిర్బంధంలో ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదు. కుటుంబ సభ్యులు, బంధువులకు దూరంగా ఉండాలి.దగ్గు, జ్వరం ఉన్నవారు, ఊపిరితీసుకోవడం ఇబ్బందులు ఉన్నవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. 108 సాయంతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలి. లేదంటే 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ (0866 2410978)కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.
* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గుబులురేపుతోంది.స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ భార్య బెగోనా గొమెజ్‌కు కరోనా వైరస్ సోకినట్లు అక్కడి ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.అయితే.. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రధాని, ఆయన భార్య క్షేమంగానే ఉన్నారని ప్రధాని కార్యాలయం పేర్కొంది.మ్యాడ్రిడ్‌లోని ప్రధాని నివాసంలో ఆయన భార్యకు వైద్యులు చికిత్సనందిస్తున్నారు.ఇప్పటికే ప్రధాని శాంచెజ్ కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్‌గా తెలిసింది.
* కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పొరుగుదేశాల సరిహద్దులు మూసివేస్తూ నిర్ణయం వెలువరించింది.ఇండో-బంగ్లాదేశ్, ఇండో-నేపాల్, ఇండో-భూటాన్, ఇండో-మయన్మార్ సరిహద్దుల వెంబడి అన్ని రకాల ప్రయాణికులపై నిషేదాజ్ఞలు విధిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తర్వులు వెలువరించింది.ఈ ఉత్తర్వులు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.అదేవిధంగా ఇండో-పాక్ సరిహద్దు మూసివేత రేపటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది.ఈ ఉత్తర్వుల ప్రకారం బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల ప్రవేశాల మార్గాల వద్ద కరోనా వైరస్ నిర్ధారణ ఆరోగ్య పరీక్షలను ముమ్మరం చేశారు.కాగా అధికారిక వీసాలు కలిగిన రాయబారులు, యూఎన్ సిబ్బందిని మాత్రం భారత్-పాక్ సరిద్దులోని అట్టారి క్రాసింగ్ పాయింట్ వద్ద అనుమతిస్తారు.
* కంటికి కనిపించని నోవల్ కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. కరోనా కారణంగా జనజీవనం స్తంభించే పరిస్థితి వచ్చింది.ముందు జాగ్రత్తగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటిస్తూ జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తుంది.ఈ నేపథ్యంలో స్కూళ్ళు, థియేటర్స్, కళాశాలలు, మాల్స్ అన్ని బంద్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.కరోనా భయంతో ప్రపంచం ఇంతగా వణికిపోతుంటే ఢిల్లీకి చెందిన ఐఐటీ స్టూడెంట్స్ మాత్రం జై కరోనా.. జై కరోనా అంటూ నినాదాలు చేస్తున్నారు.కరోనా కారణండా ఢిల్లీలోని ఐఐటీ కళాశాలలో జరగాల్సిన పరీక్షలని కొద్ది రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో హాస్టల్ విద్యార్దులు ఆ క్షణాన్ని ఎంజాయ్ చేశారు.జై కరోనా అంటూ నినాదాలు చేయడమే కాక డ్యాన్స్‌లు చేశారు.
* కరోనా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తెలిపారు.ఎన్నికల ప్రక్రియ వాయిదా మాత్రమేనని రద్దు కాదని ఆయన స్పష్టం చేశారు.ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ రద్దు కాదన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారన్నారు.ఎన్నికల్లో గెలిచిన వారితో కలిసి వారు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డట్లు చెప్పారు.ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తున్నామని.. అత్యున్నతస్థాయి సమీక్ష తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొన్నారు.ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందన్నారు.ఇప్పటికే కరోనాను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
* కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ఇరాన్ దేశం నుంచి 234 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.వీరిలో 131మంది విద్యార్థులు, 103మంది పర్యటకులు ఉన్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.అలాగే వీరందరినీ స్వదేశానికి తరలించడంలో సహకరించిన ఇరాన్ అధికారులతో పాటు అక్కడి భారత హైకమిషన్‌కి ధన్యవాదాలు తెలిపారు.
* కరోనా లాంటి కొన్ని వైరస్లు నాలుగు దశల్లో ప్రపంచాన్ని కమ్మేస్తుంటాయి.సాధారణంగా ఈ వైరస్లు ఓ దేశంలో మొదట బయటపడి క్రమేపీ నాలుగు దశల్లో మిగతా దేశాలకు వ్యాపిస్తాయి.భారత్‌లో ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశలో ఉంది.రెండో దశలోనే ఉంచాలంటే?కరోనా ప్రబలిన దేశాల నుంచి వచ్చేవారిని 14 రోజుల పాటు వేరుగా ఉంచడం.‘పాజిటివ్’గా తేలిన వ్యక్తులు కొద్ది రోజులుగా ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో వారందరినీ పరిశీలనలో ఉంచడం. లక్షణాలు కనిపిస్తే వారినీ వేరుగా ఉంచడం.జనాలు గుమిగూడకుండా చూడటం. విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు వంటివాటిని మూసివేయడం.చేతులు శుభ్రం చేసుకునేలా.. పరిశుభ్రత పాటించేలా.. శ్వాస సంబంధిత అంశాలపై అవగాహన పెంచుకునేలా ప్రజలను చైతన్యపరచడం.కరోనా పరీక్షల నిర్వహణకు, రోగులను వేరుగా ఉంచేందుకు అవసరమైన పడకలు, గదులు, ఇతర మౌలిక వసతులు భారీగా పెంచడం.