WorldWonders

ప్రకృతి పిలుపుకు వెళ్లాడు. BMW పోయింది.

Noida Thieves Steal Man's BMW At Urinals

అసలే అది బీఎండబ్ల్యూ లగ్జరీ కారు. యజమాని టాయ్‌లెట్‌ కోసమని కారు దిగాడు. ఇంకేముంది ఆ కాస్త సందులోనే తమ చేతికి పని చెప్పి.. కారుతో పరారయ్యారు కొందరు ఘరానా దొంగలు. ఈ ఘటన యూపీలోని నోయిడాలో చోటుచేసుకుంది. డీసీపీ హరీష్‌ చందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రిషభ్‌ అరోరా అనే వ్యక్తి స్టాక్‌ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి బీఎండబ్ల్యూ లగ్జరీ కారు ఉంది. దానిపై ఇంకా రూ.40లక్షల రుణం పెండింగ్‌లో ఉంది. కాగా శనివారం అర్ధరాత్రి అతడు ఓ విందుకు హాజరై తిరిగి వస్తుండగా టాయ్‌లెట్‌ కోసమని సెక్టార్ 90 ప్రాంతంలో రోడ్డుపై కారును ఆపాడు. ఈ క్రమంలో అది గమనించిన కొందరు దుండగులు ఆ కాస్త సమయంలోనే అతడి బీఎండబ్ల్యూ కారును ఎత్తుకువెళ్లారు. వెంటనే షాకైన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు త్వరలోనే కారును అప్పగిస్తామని అతడికి హామీ ఇచ్చారు. దొంగిలించిన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.