యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్ ఇప్పుడు ఓ పెద్ద ప్లాన్‌లో ఉన్నారు. తన కుమార్తె ఐశ్వర్యా అర్జున్‌ని తెలుగుకి పరిచయం చేయాలన్నదే ఆ ప్లాన్. అర్జున్ కన్నడ అయినప్పటికీ తెలుగులోనూ మంచి మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ తెలుగు సినిమాలు చేస్తున్నారాయన. తెలుగు ఇండస్ట్రీ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అంటున్న అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యా అర్జున్‌ని తెలుగులోకి పరిచయం చేయాలనుకుంటున్నారు.ఐశ్వర్య హీరోయిన్‌గా అర్జున్ తెలుగులో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఓ అగ్ర తెలుగు నిర్మాతతో కలిసి ఆయన ఈ సినిమా రూపొందించనున్నారట. ఈ సినిమా కోసమే ఐశ్వర్య తెలుగు నేర్చుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే తమిళ, కన్నడ చిత్రాల్లో కథానాయికగా నటించి, మంచి నటి అనిపించుకున్న ఐశ్వర్య ఇప్పుడు టాలీవుడ్‌లో తనను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం మలయాళ ‘ఇష్క్’ కన్నడ రీమేక్‌లో నటిస్తున్నారు ఐశ్వర్య. ఇక టాలీవుడ్ ఎంట్రీ గురించి త్వరలో అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారట
తెలుగులోకి అర్జున్ కూతురు
Related tags :