అమెరికన్ పౌరులు, కెనడా పౌరులు, కెనడా శాశ్వత నివాస పత్రాలు కలిగిన వారు తప్ప ఇతరులు ఎవరికీ కెనడా దేశంలోకి అనుమతించబోమని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఆయన భార్య ఇటీవలే కొరోనా వైరస్ బారినపడగా, ట్రూడో ప్రస్తుతం స్వీయ నిర్భంధంలో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కొరోనాపై పోరులో భాగంగా కెనడా సరిహద్దులు మూసేస్తున్నామని, ఈ వైరస్ వ్యాప్తి నిరోధించిన అనంతరం తిరిగి యథాస్థితికి పరిస్థితులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
కెనడా గేట్లు మూసేశారు
Related tags :