ఓర్పు, సహనం, నిజాయతీ నటికి చాలా అవసరం అంటున్నారు కియారా అడ్వాణీ. ‘భరత్ అనే నేను’, వినయ విధేయ రామ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నాయిక ఈమె. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘లక్ష్మీ బాంబ్’, ‘ఇందూ కీ జవానీ’, ‘పేర్షా’, ‘భూల్ భూలయ్యా2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. విమర్శలపై మీరెలా స్పందిస్తారు అన్న ప్రశ్నకు కియారా ఇలా సమాధానమిచ్చారు. ‘‘మనం చేసే పని మనతోపాటు మనల్ని అభిమానించే వాళ్లకూ నచ్చాలి. నచ్చని సమయంలో విమర్శలు ఎదురవుతాయి. అందరి అభిరుచులు ఒకేలా ఉండవు కదా! పొగిడినా, తిట్టినా నేను పట్టించుకోను. చేసే పని నిజాయతీగా చేసుకుపోతా. పరిశ్రమలో అడుగుపెట్టాక ఓర్పు బాగా పెరిగింది. ఒక్క విషయంలో మాత్రం కోపం కట్టలు తెంచుకుంటుంది. నా అసలు పేరు అలియా అడ్వాణీ. సినిమాల్లోకి వచ్చాక కియారా అడ్వాణీగా మార్చుకున్నా. కానీ కొందరు ‘కైరా’ అని పిలుస్తున్నారు. ఆ పిలుపు వింటే విపరీతమైన కోపం వస్తుంది. అలా పిలిచిన వాళ్లు నా ఎదుట ఉండే నా ఉగ్రరూపానికి వారికి చెమటలు పట్టాల్సిందే. నా స్నేహితులు మాత్రం కోపం తెప్పించడానికైనా ‘కైరా’ అని పిలుస్తారు’’ అని కియారా తెలిపారు.
చెమట పట్టిస్తా
Related tags :