* జమ్మలమడుగులో మాజీమంత్రి బిజెపి నేత ఆదినారాయణరెడ్డితో సహా 84 మందిపై కేసు నమోదు. ఈ నెల 14వ తేదీ రాత్రి దేవగుడి లో జరిగిన దాడి ఘటన పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుందిఈ దాడిలో లో చిలంకూర్ గ్రామానికి చెందిన ముత్తరాశి రెడ్డయ్య అతని సోదరుడు రామాంజనేయులుకు గాయాలు. ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్సీ శివనాథరెడ్డి జయరామిరెడ్డి గోవర్ధనరెడ్డి మరో 80 మంది పై కేసు నమోదు. సెక్షన్ 143 144 147 148 323 342 307 188 సెక్షన్ల కింద కేసు నమోదు.
* అనకాపల్లిలో దారుణం చోటు చేసుకుంది స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి కొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు .విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారు మెరుగైన వైద్యం కోసం విశాఖ కెజిహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ తల్లి కొడుకు ఇద్దరు మృతి చెందారుక్షతగాత్రులు సునీత 27 సం ,, హుదాయ్ 3 సం,, గుర్తించారు ఈ సంఘటనతో స్థానిక భీముడు గుమ్మం లో విషాద ఛాయలు అలుముకున్నాయికేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
* అవనిగడ్డ నియోజకవర్గంపులిగడ్డ గురుకుల పాఠశాలలో విషాదంవిద్యుత్ షాక్ తో విద్యార్థి మృతిఅవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి విశ్వనాధపల్లి ఉదయ్ (14) విద్యుత్ షాక్ తో మృతిఆదివారం రాత్రి పాఠశాల ఆవరణలోని బాత్రూం పైకి ఎక్కి ఇనుపరాడ్ తో కొబ్బరికాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిన విద్యార్థిఉదయ్ శరీరం, దుస్తులపై మంటలు వ్యాపించడంతో కుప్పకూలి పడిపోయిన ఉదయ్నాగాయలంక మండలం గుల్లలమోదకు చెందిన ఉదయ్ మరణించడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించిన గురుకుల పాఠశాల యాజమాన్యంఈ విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.
* ప.గో. జీలుగుమిల్లి బాలికల వసతి గృహంలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య. హాస్టల్ గదిలోని కిటికీ కి చున్నీ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న బొడ్డు నవ్యశ్రీ (16). చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెం నవ్యశ్రీ స్వగ్రామం.నవ్యశ్రీ ని జీలుగుమిల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించిన హాస్టల్ సిబ్బంది. అప్పటికే చనిపోయినట్లు నిర్దారించిన వైద్యులు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
* అనంతపురం జిల్లా తలుపుల మండలం బట్రేపల్లి వాటర్ ఫాల్స్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
* తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన శంఖవరం గ్రామం ఎస్సీ పేటలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గ్రామములోనే ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చవల భవాని(30) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక ఆంధ్ర ప్రదేశ్ మోడల్ స్కూల్, కాలేజీలో వంట మనిషిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా 2017 నుండి భవాని పనిచేస్తుంది. ఉదయం డ్యూటీ కి వెళ్లే క్రమంలో స్కూటర్ పై తన భర్తతో కలిసి వెళుతుండగా తన ఇంటికి కూతవేటు దూరంలో ఆర్ అండ్ బి రహదారిపై ఎదురుగా వస్తున్న కంకర లారీ ఢీకొనడంతో స్కూటర్ పై ఉన్న భవాని తూలి లారీ లోకి పడడంతో లారీ వెనుక చక్రం ఆమె తలపై నుండి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భవాని భర్త మధు ఆటో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. వీరికి ఒక బాబు కుమార్తె ఉన్నారు. దీంతో ఎస్సీ పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నవరం ఎస్. ఐ. రావూరి మురళీమోహన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* గోపాలపురం ఇసుక ర్యాంపులో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులుఅక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు,ప్రొక్లయినర్ సీజ్ఏ.పి.యమ్.డి.సి.సిబ్బంది లారీ డైవర్లుపై కేసు నమోదుతూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం ఇసుక ర్యాంపలో స్టేట్ జాయింట్ టాస్క్ఫోర్సు అధికారులు దాడులు నిర్వహించారు.ర్యాంపులో అక్రమంగా ఇసుక తరలిస్తూ లోడింగ్ చేయబడిన 3 లారీలు, లోడింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో 29 లారీలు, 3 ట్రాక్టర్లు, ఒక వాటర్ ట్యాంకు, ఒక 200 మిషన్ సీజ్ చేశారు.అయితే గోపాలపురం ర్యాంపు గత కొంతకాలంగా మూతపడింది. దీంతో కొంతమంది అక్రమార్కులు ఇదే అదునుగా చేసుకుని రాత్రులు అక్రమంగా ఇసుకను తరలించుకుపోతూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ దందా రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ఐజీ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వినిత్ బ్రెజివాల్ అద్దేశాలమేరకు స్టేట్ జాయింట్ టాస్క్ఫోర్స్ డి.ఎస్.పి కృష్ణకిషోర్ రెడ్డి గోపాలపురం ఇసుక ర్యాంపులో ఆదివారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు సీజ్ చేశారు. ఈ దాడులతో అక్రమార్కులు కంగుతున్నారు. అధికారులపై తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిడులు చేసినప్పటికీ అధికారులు ఏమాత్రం వెనక్కితగ్గలేదు.అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తూన్న ఏ.పి.యమ్.డి.సి.సిబ్బందిని,లారీలు డైవర్లును అదుపులోకి తీసుకుని స్ధానిక పోలీసు స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా జాయింట్ టాస్క్ఫోర్స్ డి.యస్.పి.కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఇసుక రాష్ట్రంలో సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేసిందని తనిఖీలలో భాగంగా గోపాలపురం ఇసుక ర్యాంపును పరిశీలించండి జరిగిందని అయితే గోపాలపురం ఇసుక ర్యాంపు గత కొంతకాలంగా ప్రభుత్వం మూసి వేసిందన్నారు అయితే ఈరోజు ఇక్కడ గోదావరి నదీ గర్భంలోంచి మిషన్ సహాయంతో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా చూస్తే ఆశ్చర్యం వేసిందని ఇక్కడ అక్రమాలు చూస్తూంటే ప్రజా దనం ఏవిధంగా దుర్వినియోగం అవుతుందో అర్థమౌతుందని అన్నారు.ఇక్కడ నవరత్నాలలో భాగంగా ఇండ్ల స్థలములు పూడ్చడానికి పట్టా భూముల్లో బొండు మట్టి తరలింపుతో అనుమతులు లేని పత్రాలు చూపించి ఇసుక అక్రమ రవాణా సాగిస్తూన్నారని అందుచేత వాహనాలను సీజ్ చేయడంతో పాటు అక్కడ ఉన్న సిబ్బందిని లారీలు డైవర్లు పై కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యండి జరిగిందని నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.
* కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన గ్రామంలో రాత్రి 11 గంటలకు ఒకేసారి చెలరేగిన మంటలు గడ్డివాములు దగ్ధం అగ్నిమాపక సిబ్బంది తొందరగా రాకపోవడం వల్ల ఆరు గడ్డివాములు.బూడిది పాలయ్యాయి నష్టం విలువ మూడు లక్షల రూపాయలు రైతుల అన్నారు పశువుల కోసం గడ్డివాములు వేసుకోవడం జరిగింది ఒకేసారి మంటలు రావడం రైతులకు చాలా నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వారి వివరాలు ఎనుముల రాజు ఎనుముల వన్నూరప్ప కొత్తపల్లి రామాంజి ని. వడ్డే రామకృష్ణ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.