Politics

ఎన్నికల రద్దు. వైకాపాలో కలకలం. ప్రతిపక్షంలో ఆనందం.TNI ప్రత్యేక కథనాలు

Will Andhra Contnue Forward With 2020 Elections

* ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదల పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వంరేపు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టుఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదల అంశాన్ని జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందు ప్రస్తావించనున్న ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులురేపటి కేసుల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించిన జస్టిస్ లలిత్రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా రాష్ట్ర ఎన్నికల అధికారి వేయడం పట్ల సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

* గవర్నర్ ను కలసిన ఎస్ఈసీ రమేష్ కుమార్స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను గవర్నర్ కు వివరిస్తున్న ఎస్ఈసీ రమేష్ కుమార్..కరోనా వ్యాప్తితో పాటు, ఎన్నికల్లో చెలరేగిన హింసపై వివరణ..

* రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ..స్థానిక సంస్థల ఎన్నికలను యథాతథంగా కొనసాగించాలని లేఖ…ఎన్నికలు 6 వారాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పేర్కొన్న సీఎస్..రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నాద్ధంగా ఉన్నామని తెలిపిన సీఎస్..ఎన్నికల నిర్వహణకు అవసమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితాలు ముద్రణ పూర్తయ్యాయన్న సీఎస్..ప్రజారోగ్యం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది..ప్రభుత్వ సంప్రదింపులు జరిపి ఉంటే కరోనా పై వాస్తవ నివేదికను అందించేవాళ్ళం..రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా పూర్తి నియంత్రణ చర్యలు తీసుకున్నాం…వైద్య శాఖ స్పెషల్ సీఎస్ ఇచ్చిన నివేదికను కూడా పంపిస్తున్నాం..విదేశాల నుండి వచ్చిన ప్రతి ప్రయాణికుడి స్క్రీంనింగ్ చేసి , ఇంటింటికి వెళ్లి వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేసాం..

* ఏపి బాటలో పశ్చిమబెంగాల్. పశ్చిమబెంగాల్ లో కూడా స్థానికసంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఆరాష్ట్ర ఎన్నికలసంఘం.

* కరోనా కారణంగా మహారాష్ట్రలో అన్నిరకాల ఎన్నికలు 3 నెలలపాటు వాయిదా

* కరోనాను కారణంగా చూపుతూ స్థానిక ఎన్నికలు వాయిదా వేయడాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఏపీ సీఎస్ నీలం సాహ్నీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. రాష్ట్రంలో ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ప్రభుత్వం జోక్యం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు సీఎస్ లేఖ రాయడం రాజ్యంగ ఉల్లంఘనగా భావించాల్సి ఉంటుందని అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు సీఎస్ నీలం సాహ్నీ రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఈసీకి సీఎస్ రాసిన లేఖ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

* నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేయడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి విరుచుకపడటం విడ్డూరంగా ఉంది. రాష్ట్రాన్ని సీఎం పరిపాలిస్తున్నాడా…ఎన్నికల కమిషన్ పాలిస్తున్నాడా..అని చాలా దూరం మాట్లాడారు.

* జోగి రమేష్ పాయింట్స్..నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయం అక్రమ సక్రమ అనేది ఆయనే చెప్పాలి..ఎందుకు కరోనా వైరస్ పేరుతో ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చింది.28 తేదీన అఖిలపక్షంలో కరోనా వైరస్ లేదని ఎన్నికల కమిషన్ చెప్పారు..ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాప్తికి అన్ని చర్యలు తీసుకుంటుందని నిమ్మగడ్డ రమేష్ చెప్పారు..ఎన్నికలు నిర్వహించక పోతే స్థానిక సంస్థలు నిధులు కేంద్రం నుంచి రావని స్వయంగా నిమ్మగడ్డ రమేష్ చెప్పారు..ఎందుకు ఇంతలోనే నిమ్మగడ్డ రమేష్ మాట మార్చారు..చంద్రబాబుకు గురించి ఎన్నికలు వాయిదా వేస్తారా

* ఎన్నికల కమిషన్ నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠమరికొద్దిసేపట్లో ఎన్నికల వాయిదాపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్గవర్నర్ ను కలిసిన తర్వాత ఎన్నిక సంఘం కార్యాలయానికి వచ్చిన రమేష్ కుమార్రెండు గంటల నుంచి సిబ్బందితో సమావేశంఆరు వారాల పాటు వాయిదాను కొనసాగిస్తారా..ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తారాముందుగా అనుకున్న తేదీల్లోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్న ప్రభుత్వంఎన్నికలను రద్దు చేయాలంతోన్న టీడీపీఎన్నికల కమిషనర్ ప్రకటన కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్న రాష్ట్రం

* స్థానిక సంస్థలు ఎన్నికలు తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించాలన్న సీఎం జగన్ కృషి అభినందిస్తున్నా.. జేసీ దివాకర్ రెడ్డి. కాలనికి అనుగుణంగా వస్తున్న మార్పుల్లో ఎక్కువ రోజులు తక్కువ టైం లో నిర్వహించడం వల్ల మద్యం, డబ్బు పంపిణీ ప్రవాహం తగ్గుతుంది

* ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత విమర్శలు గుప్పించారు. ‘స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో, మీ కేంద్ర మిత్రుల సహకారంతో ఆదేశాలు జారీ చేయించుకుని, ఇక్కడ స్వరం మార్చి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పనిచేసే ముఖ్య అధికారిని విమర్శించడం సరికాదు’ అని జగన్‌ను విమర్శించారు.