ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ).. సభ్య క్రీడా సంఘాలతో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఒలింపిక్స్‌కు ఇంకో 130 రోజులు మాత్రమే సమయం ఉండగా.. కరోనా ధాటికి అనేక క్రీడా ఈవెంట్లు రద్దవుతున్నాయి. ఒలింపిక్స్ సజావుగా సాగడమూ సందేహంగా మారింది. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహణలో తలెత్తనున్న ఇబ్బందులపై చర్చించేందుకు ఒలింపిక్స్‌లో భాగమైన క్రీడలకు సంబంధించి ప్రపంచ సమాఖ్యలతో, వివిధ దేశాల జాతీయ ఒలింపిక్ సంఘాలు, క్రీడాకారుల సంఘాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ తెలిపాడు. స్విట్జర్లాండ్ సాకర్ సమాఖ్య అధ్యక్షుడికి కరోనా: స్విట్జర్లాండ్ సాకర్ సమాఖ్య అధ్యక్షుడు డొమినిక్ బ్లాంక్‌కు కరోనా వైరస్ సోకింది. ఆదివారం ఉదయం వచ్చిన పరీక్ష ఫలితాల్లో 70 ఏళ్ల డొమినిక్‌కు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని సమాఖ్య ప్రకటించింది. అతను ప్రస్తుతం ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉన్నాడు. ‘‘నేనిప్పుడు బాగానే ఉన్నా. కొద్దిపాటి ప్లూ లక్షణాలు మాత్రమే ఉన్నాయి’’ అని అతను పేర్కొన్నాడు. ఆ సమాఖ్య ప్రధాన కార్యాలయాన్ని మూసేశారు. అతనితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులకు వైద్య సదుపాయాన్ని అందించారు. ఈ నెల మూడున ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన యురోసియన్ సాకర్ సమాఖ్య (యూఈఎఫ్‌ఏ) వార్షిక సమావేశంలో అతను పాల్గొన్నాడు. ఇటీవల అతనికి గొంతునొప్పి, దగ్గు వస్తుండడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు సెర్బియా సాకర్ సమాఖ్య అధ్యక్షుడు 42 ఏళ్ల స్లవిసా కొకెజాకు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణైంది.
ఒలంపిక్స్ జరుపుతారా లేదా?
Related tags :