జింబాబ్వే ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. ఫిబ్రవరిలో వార్షిక ద్రవ్యోల్బణం 540 శాతానికి చేరిందని ఆ దేశ గణాంక సంస్థ సోమవారం ప్రకటించింది. గతేడాది జూన్ తర్వాత విడుదల చేసిన మొట్టమొదటి వినియోగదారు ధరల గణాంకాలు ఇవే కావడం గమనార్హం. వినియోగదారు ధరల సూచీ ఫిబ్రవరిలో 540.16 శాతంగా నమోదైందని జింబాబ్వే నేషనల్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. గతేడాది జూన్‌ఓ వార్షిక వినియోగదారు ధరల గణాంకాలు ప్రకటించడాన్ని నిలిపివేసింది. అప్పటికి ద్రవ్యోల్బణం 176 శాతంగా ఉంది. ఏడాది క్రితమే అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇక్కడి మారకం 18 జింబాబ్వేయన్ డాలర్లకు పడిపోయింది. బ్లాక్ మార్కెట్‌లో ఈ రేటు 30 కంటే ఎక్కువగా ఉంది. ఎప్పటి నుంచో జింబాబ్వేను వేధిస్తున్న నగదు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు.. 2019 ఫిబ్రవరిలో జింబాబ్వే కరెన్సీ సంస్కరణలకు తెరతీసింది. ఇందులో భాగంగా అమెరికా డాలర్ వినియోగాన్ని రద్దు చేసి, స్థానిక కరెన్సీని మళ్లీ ప్రవేశపెట్టింది.
500 శాతానికి పైగా పెరిగిపోయిన జింబాబ్వే ద్రవ్యోల్బణం
Related tags :