Editorials

గుర్తింపురాని భారత స్వాతంత్ర్య తాత్వికుడు మానవేంద్రనాథ్ రాయ్-Part 2

గుర్తింపురాని భారత స్వాతంత్ర్య తాత్వికుడు మానవేంద్రనాథ్ రాయ్-Part 2-Forgotten Freedom Fighters-Manavendranath Roy-Part2

*** విప్లవకార్యకలాపాలకు నాంది
విప్లవ ఉద్యమంలో చేరగానే తుపాకికాల్పులు బాంబు తయారీలో నరేన్ కు ప్రవేశం లభించింది. విప్లవకారులకు తుపాకీగుండ్లు, బాంబులు ప్రధాన సాధనాలుగా వుండేవి. బ్రిటీష్ అధికారులను భయపెట్టటానికి వీటిని ప్రయోగించేవారు. మాతృభూమి స్వేచ్ఛకు వీటిని వాడుకునేవారు. మాతృదేశ స్వేచ్ఛ అనేది లక్ష్యంగా కొద్దిమంది విప్లవకారులు మాత్రమే గ్రహించారు. అరబింద్ ఘోష్ నుంచి వీరు ఉత్తేజితుయ్యారు. ఇందులో జతీన్ ముఖర్జీ, నరేన్ లు ప్రముఖులు. జతీన్ ముఖర్జీ నాయకత్వంలో అనేక విప్లవ సాహసచర్యలలో ఇద్దరూ కలిసి పనిచేశారు.
బాంలు తయారు చేసే కార్యకలాపాలలో బరీన్ ఘోష్తో కలిసి నరేన్ పనిచేశాడు. కలకత్తా శివార్లలో ఉన్న మనిక్తోలా దగ్గరున్న మొరారీ తోట ఇందుకు కేంద్రంగా ఉండేది. ఇక్కడ తయారయిన బాంబును అనేకచోట్ల ప్రయోగించారు. జతీన్ ముఖర్జీ నాయకత్వంలో సాగుతున్న విప్లవ కార్యకలాపాలకు నిధులు సమకూర్చాలనుకున్నాడు నరేన్. రాష్ట్రంలో ప్రథమ రాజకీయ దోపిడీ 1907 డిసెంబర్ 6న కలకత్తాకు 12 మైళ్ళ దూరంలో చింగ్రిపోత రైల్వేస్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. సాహసోపేతంగా సాయుధులైన ముఠా స్టేషన్లో చొరబడి, స్టేషన్ మాస్టర్ దగ్గర హింసాయుత బెదిరింపుతో తాళాలు తీసుకుని అక్కడి డబ్బును దోపిడీచేశారు. దోపిడీ తరువాత నరేన్ కొన్నాళ్ళవరకు కనిపించలేదు. డిసెంబర్ 9న నరేన్ అరెస్ట్ అయ్యాడు. సెల్టా మెజిస్ట్రేట్ వద్ద డిసెంబరు 17న కేసు విచారణకు వచ్చింది. కొందరు సాక్షులు విచారణ తర్వాత నరేన్ ను, అతడి సహచరుడు శైలేశ్వర్ బోసును వదిలేశారు. 1908లో ఏప్రిల్ 30న ఖుదీరాం బోస్ ఒక బాంబును ముజఫర్పూర్లో ప్రయోగించినపుడు వీరి కేంద్రం సంగతి తెలిసి కుట్ర కేసు పెట్టారు. దీనిని అలీపూర్ కుట్ర కేసు అనేవారు. పోలీసుకు అనుమానం ఉన్నప్పటికీ నరేన్ ఈ కేసులో లేడు.
నరేన్ చాలావరకు హౌరాలోనూ, శివపూర్లోనూ గడుపుతుండేవాడు. అనుశీన సమితి నిషిద్ధానికి గురైంది. బరీన్ ఘోష్ జైలుపాయ్యాడు. కకావికలైన ఉద్యమాన్ని పునర్వ్యవస్థీకరించే బాధ్యత నరేన్ పై పడిరది. దారీతెన్నూలేకుండా పోయినవారందరినీ కూడగట్టి జతీన్ ముఖర్జీ నాయకత్వంలో నరేన్ ఈ పనికి పూనుకున్నాడు. నరేన్ వివిధ ప్రాంతాలో పర్యటించి ఉత్సాహవంతులైన కార్యకర్తలను కలుసుకున్నాడు. ఈ ఉద్యమంలో చింగ్రిపోత ముఠావారు ప్రముఖపాత్ర వహించారు. దీనిని ‘యుగంతర ముఠా’ అనేవారు. అప్పటి నుండి జతీన్, నరేన్ అత్యంత సన్నిహితుయ్యారు.
నరేన్ ఆలోచను వేరు, రాజకీయాలు వేరు. అతడికి రాజకీయాలు, దేశవిమోచన ఏకైక లక్ష్యంగా వుండేవి.

*** రాజకీయ విప్లవకారుడు నరేన్
బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టడానికి అనేక పద్ధతులు నరేన్ అనుసరించాడు. ఇతరులకంటే నరేన్ రాజకీయ ఆలోచన చాలా ముందు వుండేది. అతడు రాజకీయ విప్లవకారుడు. నరేన్ కు సోషలిస్టు భావాలుండేవి. మతంతో రాజకీయాలు నడిపేవాడు కాదు. బ్రిటీష్ ప్రభుత్వం స్థానంలో ఎటువంటి ప్రభుత్వం కావాలో నరేన్ చెబుతుండేవాడు. అవకాశాలున్న కొద్దిమంది ప్రభుత్వం కాక, ప్రజా ప్రభుత్వం కావాలని అతడు ఆలోచించాడు. విప్లవ మార్గాల ద్వారా స్వాతంత్య్రాన్ని సముపార్జిస్తే అటువంటి ప్రభుత్వం ఏర్పడవచ్చని అనుకున్నాడు. ఆనాడు నరేన్ మన నాయకుడు అని భావించిన భూపతి మజుందార్ కూడా మాలో చాలామంది కంటే నరేన్ రాజకీయాలు బాగా చర్చించేవాడని చెప్పాడు. 1910లో హౌరా, శివపూర్ కుట్ర కేసులో నరేన్, జతీన్ ముఖర్జీపై ముఖర్జీతో సహా 46 మందిని నిర్బంధించారు. 1911లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం నరేన్, జతీన్ లు విడుదయ్యారు. ఆ తరువాత సాయుధ తిరుగుబాటు కార్యక్రమం గురించి ఆలోచించారు. కానీ, సమయం రాలేదని భావించారు. విప్లవకారుందరినీ సాయుధ తిరుగుబాటు కార్యక్రమానికి ఆమోదించమని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ముఠామధ్య ఐక్యత సమకూర్చి ఒకే నాయకత్వం కిందకి తీసుకురావడానికి నరేన్ చేపట్టిన ఈ రెండు బాధ్యతలు విజయవంతమయ్యాయి. దీనికోసం బెంగాల్ అంతా తిరగడమే కాకుండా దేశంలో కొన్ని ప్రాంతాలు కూడా సందర్శించాడు. పోలీసులకి అనుమానం రాకుండా కొంతకాలం సన్యాసిగా తిరిగాడు. కొందరు విప్లవ నాయకులు కూడా సన్యాసులుగా మారారు.

*** నూతన పర్యటనలు, కొత్త పరిచయాలు
కాశీ, ఆగ్రా, అలహాబాద్, మధుర పర్యటన వన దేశాన్ని గురించి నరేన్కు బాగా తెలిసింది, కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. నరేన్ కు ఏర్పడిన పరిచయాలు ఎంతో ఉపయోగపడ్డాయి. వీరు స్థాపించిన సమైక్యవ్యవస్థకు జతీన్ ముఖర్జీ నాయకత్వం వహించాడు. కొంతకాలం నాయకుడి పేరును బయట పెట్టలేదు. దీనివల్ల కొన్ని కొత్త చిక్కులు వచ్చాయి. కానీ అవి తొందరలోనే సమసిపోయాయి. ఏడాదిలోగా సమైక్య సంఘాన్ని శాఖతో ఏర్పరిచారు. బెంగాల్లోనూ, బయట కూడా సంబంధాలు పెట్టుకున్నారు. అదే యుగంతర్ పార్టీ అయ్యింది.
జైలునుంచి విడుదయ్యాక నరేన్ ‘ఈక్విటీ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ’లో ఉద్యోగం సంపాదించాడు. అయితే అది ఒక ముసుగు మాత్రమే. ఒక బియ్యపు మిల్లులో బిల్ కలెక్టర్ గాను, బేలీ ఘటనలో కట్టె అడితిలోను పనిచేశాడు. 1912-13లో గోపాల్ మల్లిక్ వీధిలో ఒక వసతి గృహంలో వుండేవాడు. రెసిడెన్సీ కాలేజీలో ఈడెన్ హిందూ హాస్టలుకు వెడుతూ సతీష్ చక్రవర్తి గదిలో విద్యార్థుతో తేనీరు సేవించేవాడు. సతీష్ అప్పుడు ఎమ్.ఎ.విద్యార్థి.
నరేన్, జతీన్ ముఖర్జీలు సాయంకాలాలు భోజనశాలకు వెళ్ళి సైన్సు విద్యార్థులను తరచు కలుస్తుండేవారు. అక్కడకు వచ్చేవారిలో సుప్రసిద్ధ విజ్ఞానవేత్తలు జ్ఞానచంద్ర ఘోష్ (తరువాత యు.జి.సి. ఛైర్మన్ అయ్యాడు), మేఘనాథ్ సాహ (న్యూక్లియర్ ఫిజిక్స్ కు చెందిన సహాయ ఇన్స్టిట్యూట్ అధిపతి) ఉండేవారు.
డిగ్రీ చదువు అంతగా లేకున్నా, రాజకీయ ఆలోచనలో నరేన్ కు చాలా ఉన్నతస్థానం వుండేది. స్వేచ్ఛా భారతావనిలో ఎటువంటి ప్రభుత్వం వుండాలో, కలకత్తా కార్పొరేషన్, ఇతర స్థానిక సంస్థలు ఎలా ఉండాలో, ప్రజలు వీటిలో పాల్గొని సమాజ సంక్షేమానికి కృషి చేయవలసిన తీరు నరేన్ పేర్కొంటుండేవాడు. అప్పట్లో విప్లవకారు బ్రిటిష్ పాఠకులకు గుణపాఠం చెప్పాలని తప్ప ఇలాంటి భావాలు వారిలో ఉండేవికావు.
కొంతకాలానికి నరేన్ తన ఉద్యోగాన్నీ వదిలేసి ఒక రెస్టారెంట్ ను తెరిచాడు. ఆయుధాల సేకరణకు పరస్పరం సమాచారం తెలుసుకోవడానికి అది కేంద్రంగా వుండేది. సైనికులు, నావికులు ఆ హోటల్ కు ఇష్టంగా వచ్చేవారు. నరేన్ చేసే ప్రత్యేక పదార్థాలు అందుకు కారణం. ఎం.ఎన్.రాయ్ గా మారిన తరువాత కూడా ప్రత్యేకమైన వంటలు చేసేవారు.
1912 డిసెంబర్ 23న ఢిల్లీలో ఏనుగుపై ఎక్కి వైశ్రాయ్, అతని భార్య లేడీ హార్డింజ్ వెడుతుండగా బాంబు పేలింది. ముందున్న సేవకుడు అక్కడికి అక్కడే చనిపోయాడు. నేరస్థులను వెంటనే పట్టుకోలేక పోయారు. ఆ కారణంగా రాష్ బిహారీ బోస్, వసంతకుమార్ విశ్వాన్ అనే ఇరువురు బెంగాలీ విప్లవకారులని తెలిసింది. ఇది కూడా 1911లో డల్హౌసీ స్వ్కేర్ దగ్గర పేలిన బాంబువంటిదేనని, అమరేంద్రనాథ్ ఛటోపాధ్యాయలకు రాష్ బిహారేబోస్ తో సన్నిహిత సంబంధం ఉందని, చందర్ నాగూర్లో తయారైన బాంబును వసంత కుమార్ కు ఇచ్చి రాష్ బిహారీకి పంపాడని తెలిసింది. ఢిల్లీ కుట్ర కేసులో విచారణానంతరం వసంతకుమార్ కు ఉరిశిక్ష వేశారు. రాష్ బిహారీని అరెస్టు చేయలేకపోయారు. దేశంలో సాయుధ తిరుగుబాటుకై విఫల ప్రయత్నం చేసిన రాష్ బిహారీ 1915లో జపాన్ వెళ్ళిపోయాడు. అమరేంద్రనాథ్ కు జతీన్, నరేన్ లతో సన్నిహిత సంబంధం వుండేది.
ఐరోపా, అమెరికా, బర్మా, ఇండొనేషియా, బాంకాక్, సింగపూర్, హాంకాంగ్ లలో ఉన్న భారతవిప్లవ ముఠాతో సంబంధాలు ఉండేవి. కెనడాలోని వాంక్యూవర్, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోను కట్టుదిట్టమైన విప్లవ ముఠాలున్నాయి. ఈ రెండు చోట్లా గదర్ పేరిట విప్లవ కార్యకలాపాలు జరుగుతుండేవి. 1911లో కర్ దయాళ్ ‘గదర్’ అనే పత్రికను, యుగంతర్ ఆశ్రమ కేంద్రాన్ని శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించాడు. జతీన్ ముఖర్జీ తన సహచరుడు సత్యసేన్ను గదర్ పార్టీతో సంబంధాలు పెట్టుకోవడానికై పంపారు. గదర్ పార్టీ ఇండియాకు తూర్పున ఉన్న వివిధ దేశాలలో శిక్కు ద్వారా సంబంధాలు ఏర్పరిచారు.
సాయుధ తిరుగుబాటుకు సన్నద్ధం కావాంటే నిధులవసరం. ఈ పని నరేన్ కు అప్పగించారు. ఎమ్.ఎన్.రాయ్ తొలి ఖర్చు నిమిత్తం కావసిన పనిని తనకు అప్పగించారని, అది పథకం ప్రకారం చేశానని పేర్కొన్నారు.
అప్పటికి అంతర్జాతీయ పరిస్థితి ఉద్రిక్తతలో పడింది. యుద్ధమేఘాలు కమ్ము కొచ్చాయి. ఇంగ్లండు జర్మనీ మధ్య యుద్ధం వచ్చేటట్లు ఉంది. యుద్ధం వస్తే జర్మనీకి సహాయపడటానికి సిద్ధంగా వుండవసిందని విప్లవకారులకు వారి విదేశీ మిత్రుల నుంచి సమాచారం అందింది.
ఇండియాలో విప్లవకారులు జర్మనీవారితో సంభాషణలు ప్రారంభించారు. 1913 చివరలో కలకత్తాలో ఉన్న కాన్సలేట్ జనరల్ ద్వారా సంబంధాలు పెట్టుకోవడానికి నరేన్ భట్టాచార్య ప్రయత్నాలు ప్రారంభించాడు. నరేన్ కోరికపై కలకత్తా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డి. థిబాల్ట్ ద్వారా జర్మన్ కాన్సులేట్ జనరల్ తో సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో సతీష్ చక్రవర్తి (కలకత్తా యూనివర్సిటీ ఎం.ఎ. విద్యార్థి) సహకరించాడు.
జర్మనీతో వ్యాపారం సాగించేనిమిత్తం తన మిత్రులు కొందరు జర్మన్ కాన్సల్ జనరల్తో కలుసుకోవానుకుంటున్నారని థిబాల్ట్కు చక్రవర్తి చెప్పాడు. ఆ స్నేహితులెవరో తొసుకోకుండానే సతీష్ చక్రవర్తి పేరిట థిబాల్ట్ జర్మన్ కాన్సల్ జనరల్తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. నరేన్, జతీన్ ముఖర్జీు జర్మన్ కాన్సల్ జనరల్ ను కలుసుకున్నారు. 1914 ప్రారంభంలో వీరిరువురూ కలకత్తాలో జర్మన్ కాన్సల్ జనరల్ తో అనేక సమావేశాలు జరిపారు.
యుద్ధం రాగానే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు గెరిల్లా పోరాటం చేయడానికి ఆలోచనలు జరిపారు. దీనికిగాను జర్మనీ నుండి ఆయుధ సహాయం కావాలన్నారు. ఈ సమావేశాలలో కొన్నిటికి జతీన్ ముఖర్జీ సన్నిహితుడు అత్యుల్ కృష్ణఘోష్ కూడా వచ్చాడు.
1915 ఫిబ్రవరి 12న నరేన్ మరి ఇద్దరితో పట్టపగలే కలకత్తాలో గార్డెన్ రీచ్ వద్ద చిర్డ్ అండ్ కంపెనీని దోచారు. కలకత్తాలో ఈ రాజకీయ దోపిడీని గురించి విచిత్రంగా చెప్పుకున్నారు. దోపిడీలో పెద్దదిగా పేర్కొంటున్న ఈ కార్యక్రమం నిమిషాలమీద జరిగిపోయింది. తుపాకీ గురి చూపిస్తూ ఒక్కసారి కూడా కాల్చకుండా పని పూర్తి చేశారు.
ఒకటి రెండు రోజుల తర్వాత ఈ దోపిడీకి గాను నరేన్ను అరెస్టు చేశారు. దీనితో జతీన్ ముఖర్జీ తన కుడిభుజం పోయిందంటూ చాలా బాధపడ్డాడు. నరేన్ను జైలునుంచి తప్పించడానికి జతీన్ ముఖర్జీ లాల్ బజార్ పోలీస్ కేంద్రంపై దాడిచేయ తలపెట్టాడు. కానీ మరుసటి రోజు లాల్ బజార్ నుంచి పోలీస్ పోర్టీకు వెడుతున్నప్పుడు తప్పించవచ్చునని ఒకరు సూచించారు. పిస్టోళ్లు ఇచ్చి ఈ పని పూర్తి చేసుకురమ్మని అయిదుగురిని పంపించారు. అందులో గోపెన్ రాయ్, సతీష్ చక్రవర్తి, ప్రొ….విలీమిత్తక మరో ఇద్దరు ఉన్నారు. అయితే నరేన్ కు జైలులో జబ్బు చేయడం వల్ల అతనిని ఆరోజు బయటకు తీసుకురాలేదు.
నరేన్ కు బెయిల్ ఇప్పించాలని డా. జాదూ గోపాల్ ముఖర్జీ సూచించారు. ఇక ఏమాత్రం జాప్యం చెయ్యకుండా జతీన్ ముఖర్జీ స్వయంగా తారక్ సాధూ అనే ఛీఫ్ గవర్నమెంట్ ప్లీడరు దగ్గరకు సహాలకై వెళ్ళాడు. అజ్ఞాతవాసంలో ఉన్న జతీన్ ముఖర్జీ స్వయంగా తారక్ సాధూ అనే ఛీఫ్ గవర్నమెంట్ ప్లీడరు దగ్గరకు సలహాకై వెళ్ళాడంటే నరేన్ను జైలునుంచి తప్పించాల్సిన అవసరం, దానిలోని ప్రాధాన్యం తెలుస్తుంది. తమ ముఠాలో ఎవరైనా ముందుకు వచ్చి బాధ్యత వహిస్తే నరేన్ కు బెయిల్ ఇవ్వవచ్చునని తారక్ సాధూ తనకు జతీన్ పై ఉన్న గౌరవంతో చెప్పాడు.
జతీన్ ముఖర్జీ వెంటనే ఫరీద్ పూర్ ముఠా నాయకుడు పూర్ణదాస్ కు స్వదస్తూరితో దోపిడీకి బాధ్యత వహించే కార్యకర్తను పంపించవసిందిగా వ్రాసి పంపించాడు. రాధాచరణ్ ప్రామాణిక్ అనే అతను పూర్ణాదాస్ కోరికపై దోపిడీకి తానే బాధ్యుడనని వ్రాతపూర్వకంగా ఇచ్చాడు. రాధాచరణ్ కు 7 సంవత్సరాలు కఠిన శిక్ష పడిరది. జైలులో అతడు పిచ్చివాడుగా చనిపోయాడు. 1915 ఫిబ్రవరి 22న ఇద్దరు హామీ ఉండగా 1000 రూపాయ బెయిల్తో నరేన్ ను విడుదల చేశారు. నరేన్ ను అరెస్టు చేసిన సురేష్ ముఖర్జీ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ ను జతీన్ ముఖర్జీ ఫిబ్రవరి 28న విప్లవకార్యకర్తలకి ఉత్తర్వు ఇచ్చి కాల్చి చంపించాడు.

*** ఇంగ్లండ్, జర్మనీ మధ్య యుద్ధం
1914 ఆగస్టులో ఇంగ్లండ్, జర్మనీ మధ్య యుద్ధం మొదయింది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకోవాని విప్లవకారులు ద్విగుణీకృతోత్సాహంతో కృషిచేశారు. సాయుధ పోరాటం జరపాలని నిర్ణయించారు. సమైక్య పార్టీకి ప్రధాన నాయకుడుగా జతీన్ ముఖర్జీని ఎంపిక చేశారు. అప్పట్లో జతీన్ ముఖర్జీ కలకత్తా వెలుపల కాంట్రాక్టరుగా వుంటూ కార్యకలాపాల నిమిత్తం వచ్చిపోతుండేవాడు. అది క్షేమకరంగా లేకపోయింది. జతీన్ కార్యకలాపాలు క్షేమకరంగా జరిగేనిమిత్తం నరేన్ బాసోర్కు ఆట్టే దూరంలేని మెహదీయా గ్రామంలో బస ఏర్పాటు చేశాడు. యూనివర్సల్ ఎంపోరియం పేరిట ఒక వాణిజ్య సంస్థను నెకొల్పి రాకపోకను సానుకూలం చేసుకున్నారు.

*** సాయుధ పోరాటానికి నరేన్ ప్రయత్నాలు
కలకత్తా సాయుధ పోరాటానికి ప్రయత్నాలు జరిగాయి. తటపటాయిస్తున్నవారికి నరేన్ నచ్చ చెప్పి, రాకపోకలు స్తంభింపచేసి చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చాడు. చక్రధర్ పూర్, సంబల్ పూర్లో కేంద్రాలు ప్రారంభించి అవసరం అయినపుడు రవాణా రాకపోకలు స్తంభింపజేయాని నిర్ణయించారు.
యుద్ధంవల్ల ఇండియాలో బ్రిటిష్ దళాలు తగ్గిపోతాయని, భారతీయ సైనికలు విప్లకారులకు సహాయపడతారని నరేన్ సూచించాడు. 1914లో నవంబర్లో సత్యేన్ సేన్ కాలిఫోర్నియాలోని గదర్ పార్టీతో సంబంధాలు పెట్టుకుని కలకత్తాకు తిరిగి వచ్చాడు. అదే ఓడలో తిరిగి వస్తున్న శిక్కు, విష్ణుగణేశన్ పింగ్లే అనే మహరాష్ట్ర విప్లవకారుడు ఉన్నారు. శిక్కు నాయకుడు కర్తార్ సింగ్ పింగ్లేను జతీన్, నరేన్ కు పరిచయం చేశాడు. రాష్ బిహారీ ఘోష్తో కూడా సంబంధాలు ఏర్పరిచారు. కొన్నాళ్ళకు తిరుగుబాటు పథకాన్ని చర్చించే నిమిత్తం జరిగిన సమావేశంలో రాష్ బిహారీ బోస్, జతీన్ ముఖర్జీ, నరేన్, అమరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ, అచ్యుత కృష్ణఘోష్ ఇందులో పాల్గొన్నారు.
1915 ఫిబ్రవరి 21 సాయుధ పోరాట దినంగా నిర్ణయించారు. పోలీసులకు ఈ విషయం ముందే తెలిసింది. ప్రముఖ విప్లవకారును నిర్బంధించడం మినహా ఏమీ చేయలేకపోయారు. రాష్ బిహారీ అరెస్టు కాకుండా తప్పించుకుని జపాన్ వెళ్ళిపోయాడు. పింగ్లే భారత పదాతి దళంలో ప్రచారంలో నిమగ్నుడై వుండగా అరెస్టు చేసి ఉరిశిక్ష వేశారు. నరేన్, జతీన్ ముఖర్జీను కలుసుకున్న కర్తార్ సింగ్ అరెస్ట్ అయ్యి జీవితాన్ని అర్పించవలసి వచ్చింది.
తిరుగుబాటు ఫలించకపోయినా ఇందునిమిత్తం చేసిన ప్రయత్నాలవల్ల జాతీయత ఆవేశం ఏ మేరకు వ్యాపించి వుందో, దానివల్ల బ్రిటీష్ సామ్రాజ్యానికి భారతదేశంలో తీవ్ర ప్రమాదం ఏర్పడటం గమనించటానికి తోడ్పడుతుంది.

*** ఆయుధాగారాల ముట్టడి
1915 ఫిబ్రవరి 21న తిరుగుబాటు జరపాలని నిర్ణయించినా పథకాలు బయటపడ్డాయన్న అనుమానంతో చివరి సమయంలో 19వ తేదీకి మార్చారు. అందరూ ఆయుధాలు సమకూర్చుకున్న తరువాత మూకుమ్మడిగా ఆయుధాగారాన్ని ముట్టడించి ఐరోపా అధికారులను చంపనారంభించాలనుకున్నారు. తరవాత మిగిలిన ఐరోపా వారిని చంపాలని అనుకున్నారు. తిరుగుబాటు విషయం వాసనపసిగట్టిన మద్దతు దార్లుగా వచ్చిన ముఠాలు వెళ్ళిపోయాయి. మొత్తం పన్నుగడ విఫలమైంది. 26న పంజాబు దళంతో తిరుగుబాటు చేసే సిపాయిలు చేతులు కలిపి ఆయుధాగారంపై దాడిచేయదలచారు. సమాచారం తెలిసిన సైనికాధికారులు వ్యవహారాన్ని అదుపులో పెట్టారు. ఫిబ్రవరి 19 నాడు లాహోర్ తిరుగుబాటు విఫలం కావటంతో కుట్ర యావత్తు కుప్పకూలిపోయింది.
పంజాబులో లాగా వ్యవహారాలు అంత చురుకుగా సాగలేదు. బెంగాల్ విప్లవకారులకు రాస్ బిహారీ బోస్ నుంచి సంకేతాలు అందలేదు. జర్మనీ నుంచి అర్థించిన ఆయుధాలకై వారు ఎదురు చూస్తున్నారు. అవిలేకుండా తిరుగుబాటు అసాధ్యమనుకున్నారు. 1915 మార్చిలో ఆయుధాలను ఇవ్వడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ జర్మనీ నుంచి కబురు వచ్చింది. కాలిఫోర్నియాలోని బర్కిలీలో చదువుకుంటున్న జితేంద్రనాథ్ హారీ జర్మనీలో రెండు మాసాలు వుండి ఇండియాకు వస్తూ ఈ కబురు తెచ్చాడు. వివరాలు చర్చించటానికి ప్రతినిధిని ఎవరినైనా బటేవియాకు పంపించమన్నారు. ఆయుధాలు వస్తాయి అనేసరికి విప్లవకారులు ఆనందించారు. ప్రతినిధులను పంపటానికి అంగీకరించారు. ఆ బాధ్యతలు నరేన్ పైన పడ్డాయి. అది అతడి రాజకీయ జీవితంలో మలుపు అయింది.

*** బెంగాల్లో స్వాతంత్య్ర విప్లవాగ్ని
మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యేనాటికి (1914) కొందరు భారత విప్లవకారులు జర్మనీ చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపు జరిపి బ్రిటీషువారికి వ్యతిరేకంగా భారతదేశానికి సహాయపడాలని కోరారు. ఈ సహాయం ఎవరికి అందించాలనే సమస్య వచ్చినప్పుడు బెంగాల్లోని విప్లవకారుడు జతీన్ ముఖర్జీకి అప్పగించాలని సూచించారు. అప్పటికి బెంగాల్లో వున్న వివిధ మతాలవారు పోరాట నాయకుడిగా జతీన్ ముఖర్జీని గుర్తించారు. అయితే దేశంలోకి డబ్బును, ఆయుధాలను చేరవేయటం కష్టం కనుక ఇతర మార్గాలు అన్వేషించాలనుకున్నారు. అప్పుడు జతీన్ కు నమ్మకస్తుడుగా సమర్ధమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన నరేంద్రనాథ్ ను అర్హుడుగా పేర్కొన్నాడు. అప్పటికి నరేంద్రకు 26 సంవత్సరాల వయస్సు. బెంగాలీ, ఇంగ్లీషు మాట్లాడగలడు. అయితే విదేశాలకు వెళ్ళటం తొలి ప్రయత్నం అవుతుంది. ఆ బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని నరేంద్రకు అప్పగించారు. డబ్బును, ఆయుధాలను ఎక్కడ స్వీకరించాలి. అనే సమస్య వచ్చినప్పుడు డచ్ పాలనలో వున్న ప్రాంతాలలో అందుకు వెసులుబాటు ఉన్నట్లు గుర్తించారు. జావాలో ఈ ఆయుధాలను ధనాన్ని నరేంద్రకు అప్పగించమని జర్మనుకు కబురు చేసారు. నరేంద్ర తొలిసారి ఓడ ప్రయాణం చేసి జావా చేరుకున్నాడు. అయితే జర్మనులు ఆయనకు డబ్బు అందించినా ఆయుధాల ప్రస్తావన రాలేదు. నిరుత్సాహంతో డబ్బు తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చి మదరాసు మీదుగా కలకత్తా చేరుకుని జతీన్ కు ధనాన్ని అప్పగించాడు. ఈలోగా ఆయుధాలు, ధనం ఇస్తానని మళ్ళీ జర్మనులు కబురు చేశారు. రెండోసారి కూడా నరేంద్రనాథ్ నే మళ్ళీ పంపించారు.
ఇంతలో పోలీసు గాలింపు చర్యల్లో బాలాసోర్లోని యూనివర్సల్ యంపోరియమ్ సైకిలు షాపును సోదా చేశారు. అది మొహందియాలో జతీన్ ముఖర్జీకి, కలకత్తాలో ఉన్న విప్లవ కేంద్రానికి రహస్య సమాచారాలు నడిపేకేంద్రం. అడవులు గాలించి జతీన్ రహస్య స్థావరాన్ని తెలుసుకున్నారు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి జతీన్ అనుచరులు మీరు తప్పించుకుని పారిపొండి మేము పోలీసులకు మా ప్రాణాలిచ్చి ఆపుచేస్తాం అన్నారు. విప్లవానికి మీ నాయకత్వం అవసరమని ఎంత చెప్పినా జతీన్ అంగీకరించలేదు. కేవలం నలుగురు సహాయంతో ఏభైమందికి పైగా వున్న బ్రిటీషు బలగంతో తిండి నిద్రలేని జతీన్ మూడుగంట సేపు పోరాడి తుపాకి గుండు దెబ్బకి నేలకి ఒరిగాడు.
1915 ప్రారంభంలో ఈ రెండో ప్రయాణం జరిగింది. ఏమైనా సరే ఆయుధాలు డబ్బు లేకుండా తిరిగి రాకూడదని నరేంద్రనాథ్ పట్టుదగా వెళ్ళాడు. వెళ్ళి కొద్ది రోజుకే తన గురువు సన్నిహితుడు విప్లవ నాయకుడు జతీన్ ముఖర్జీ బ్రిటీషు పోలీసుల చేతిలో హతమయ్యాడని వార్త వచ్చింది. అంతటితో వెంటనే ఇండియా వెళ్ళానే ఆలోచన కూడా నరేంద్ర విరమించుకున్నాడు. పట్టుదలతో తన పథకాన్ని సాధించదలచాడు.

*** ఏమిటా పథకం?
భారత సరిహద్దుల్లో అస్సాం, మణిపూర్ కొండ ప్రాంతాలలో ఆదివాసులు అబోర్ జాతి బ్రిటీషువారిపై తిరుగుబాటు చేశారు. అయితే ఆ తిరుగుబాటును ప్రభుత్వం అణచివేసింది. మళ్ళీ వారిని రెచ్చగొట్టి వారికి డబ్బు ఆయుధాలు ఇచ్చి బ్రిటీషువారిపై పోరాటంలో వాడుకోవాలని నరేంద్రనాథ్ పథకం. చైనా నుంచి కూడా ఆయుధాలు వేగంగా తీసుకురావచ్చని భావించాడు. ఇండొనేషియా, సుమత్రా మీదుగా జర్మనీవారిచ్చే ఆయుధాలను స్వీకరించి అండమాన్ దీవులలో ఖైదీగా వున్న భారతీయులను విడిపించి భారత తూర్పు తీరంలో ఒరిస్సాకు సులభంగా చేరవచ్చునని ఊహించాడు.
జర్మనీవారు పథకంలో సహాయపడితే భారతదేశంలోని బ్రిటీషువారిని తరమగొట్టవచ్చని భావించాడు. జర్మనీవారు నరేంద్రనాథ్ పథకాన్ని ఒప్పుకున్నట్లే నటించి తీరా అమలుపరచబోయేనాటికి జర్మన్ కాన్సల్ కన్పించకుండా పోయాడు. అయితే కొంత డబ్బు మాత్రం అందించారు. నిరుత్సాహంతో నరేంద్రనాథ్ జపాన్ వెళ్ళి రాస్ బిహారీ బోస్ తో తన పథకం చెప్పి ముందుకు సాగానుకున్నాడు. ఇలాంటివెన్నో జపాన్ ప్రభుత్వం చేయగలదని బోస్ చెప్పాడు. అప్పట్లో జపాన్ బ్రిటన్ కు వ్యతిరేకం కాదు. ఏమైనా రాస్ బిహార్ మాటు చెప్పి తప్పుకున్నాడు. అతడు ఉత్తరోత్తర జపాన్ అమ్మాయిని పెళ్ళి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు.
అప్పట్లో చైనా నాయకుడు సన్ ఎట్ సేన్ జపాన్లో వుంటున్నాడు. చైనాలో అధికారం కోల్పోయి అతడు తాత్కాలికంగా శరణు పొందాడు. ఆనాటికి సన్ ఎట్ సేన్ అంటే భారతీయులలో వీరారాధన వుండేది. అనుకోకుండా నరేంద్రనాథ్ అతన్ని కలిసి తన పథకాన్ని వివరించాడు. అతడు కూడా ఆసియా విమోచనకు భారతదేశ విముక్తికి జపాన్ తోడ్పడుతుందని చెబితే నరేంద్రనాథ్ ఆశ్చర్యపోయాడు. నరేంద్రనాథ్ పథకం విన్న సన్ ఎట్ సేన్ సహా ఇచ్చి చైనా వెళ్ళి అక్కడ జర్మన్ రాయబారిని కలుసుకోమని చెప్పాడు. ఆమేరకు నరేంద్రనాథ్ చైనా వెళ్ళి జర్మన్ కాన్సల్ను కలిశాడు.
నరేన్ ఎక్కడికి వెళుతున్నా అతనిపై బ్రిటీషు పోలీసు కన్నువేసే వుంచారు. జపాన్ లోనూ చైనాలోనూ వెంటాడారు. 24 గంటలో జపాన్ వదిలి వెళ్ళిపోవాని ఉత్తర్వు రానున్నట్లు గ్రహించి చైనా బయల్దేరాడు. మొత్తంమీద ఒక సరుకు ఓడలో దొంగతనంగా ప్రయాణం చేసి చైనాకు చేరుకున్నాడు. ఒకచోట బ్రిటీష్ పోలీసు తటస్థపడి వైట్ గారూ ఎక్కడికి పోతున్నారని అడిగాడు. జపాన్లో నరేంద్రనాథ్ మారుపేరు వైట్. ఆ అడిగిన వ్యక్తి పోలీసు ఆఫీసర్. అతను నరేంద్రనాథ్ ను వెంటబెట్టుకుని పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్ళాడు. అక్కడున్న అధికారి కేసు వివరాలేమిటి, పై నుంచి ఉత్తర్వులేమైనా వచ్చాయా అని అడిగి, ఏమీ రాలేదని తెలుసుకుని వెళ్ళిపొమ్మన్నారు. మర్నాడు వచ్చి కలవమన్నారు. మొత్తం మీద బయటపడి స్థానిక జర్మన్ కాన్సులేట్ కు వెళ్ళి ఈ విషయం చెప్పాడు. వారి సహాయంతో చైనాలోని పెకింగ్కు చేరుకున్నాడు. అక్కడ కూడా అనుకున్న సహాయాలేమీ అందలేదు. జర్మనీ రాయబారి అక్కడ వుండటం వలన తన పథకాన్ని మరొకసారి అతనికి వివరించాడు. అతడు సావధానంగా విని నరేంద్రనాథ్ కోరే డబ్బు ఆయుధాలు తాను ఇవ్వలేనని, జర్మనీలోని ఎ.పి.జనరల్ చేయగలడని కనుక అక్కడికి వెళ్ళమని సహా ఇచ్చాడు.
జర్మనీ పోవటానికి తనకు ఎలాంటి పాస్ పోర్టు లేదని చెప్పగా కాన్సల్ జర్నల్ ఆ ఏర్పాటు చేసి పెట్టాడు. ఫాదర్ మార్టిన్ అనే క్రైస్తవ పురోహితుడు ఇండియాలోని ఫ్రెంచి కానీ పాండిచ్చేరికి చెందినవాడని ఫ్రాన్స్ లో క్రైస్తవ మత అధ్యయనం చేయడానికి వెడుతున్నట్లు పాస్ పోర్టు ఇచ్చారు. అక్కడ దగ్గరలో వున్న క్రైస్తవ పుస్తకాల షాపులో బైబిలు కొని ఫాదర్ మార్టిన్ అవతారంలో జపాన్ ఓడ ప్రయాణం తలపెట్టాడు. జపాన్లో వున్న కొబె రేవుపట్టణానికి వెళ్ళి అక్కడి నుండి మరొక ప్రధాన రేవుకు పయనించాడు.
తన ప్రయాణంలో నరేంద్రుడు అనేక యిబ్బందులకు గురి కావలసి నచ్చింది. నౌక జపాను చేరేలోగానే బ్రిటీషు అధికారులు ఓడను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడం జరిగింది. ఓడ అధికారుల ఓడలోని ఒక చెక్కను తొగించి నరేంద్రుని లోపలకు దించి మళ్ళీ చెక్క బిగించారు. సముద్రం మధ్యలో మరొకసారి కూడా యిదే విధంగా నరేంద్రుడు దాక్కోవలసి వచ్చింది. అమెరికా తీరం చేరేవరకూ నరేంద్రుడు తోటి ప్రయాణీకులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ కేవలం మత ప్రచారకునిగా కనబడి వారితో మత సంబంధమయిన అనేక విషయాలు చర్చిస్తూ నిరపాయంగా తన ప్రయాణం సాగించాడు.
పసిఫిక్ మహాసముద్రంలో జపాన్ వారి ఓడలో బయల్దేరిన నరేంద్రకు వింత అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. ఓడ అంతా కూడా జపాన్ వారే వున్నారు. అందువలన రెండు వారాలలో ప్రయాణంలో సాధ్యమైనంతవరకూ తన గదికే పరిమితమై వుండేవాడు.
పసిఫిక్ మహాసముద్రంలో ఆ విధంగా రెండు వారాలు యాత్ర చేసి అమెరికా పశ్చిమతీరానికి చేరుకున్నాడు. ఒక ప్రయాణీకురాలు మాత్రం ఆ ఓడలో పరిచయమైంది. ఆమె నరేంద్రవలె క్రైస్తవమతానికి చెందిన వ్యక్తి. మిస్ గ్రే ఆమె పేరు. ఆమె ఒక్కతే నరేంద్రతో ఇంగ్లీషులో మాట్లాడగలిగింది. మొత్తం మీద శాన్ఫ్రాన్సిస్కో రేవుకు చేరిన నరేంద్రనాథ్ వింత అనుభవాలెన్నో సంతరించుకున్నాడు. ఓడ దిగి గదికి చేరుకునేసరికి జర్మన్ గూఢచారా? బ్రాహ్మణ విప్లవాదా? శాన్ఫ్రాన్సిస్కోలో అడుగు పెట్టిందెవరు? అని పత్రికలో వార్తలు వచ్చాయి. అదిచూసి హడావుడిగా గది ఖాళీ చేసి స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రాంతానికి వెళ్ళి పాలో ఆల్టోలో గది అద్దెకు తీసుకున్నాడు. దగ్గరలో వున్న స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ధనగోపాల్ ముఖర్జీని కలిశాడు. అతడు కవి. యుక్తవయస్సులోనే పేరు ఆర్జించినవాడు. బెంగాల్ నుండి వచ్చి ప్రతిభా వంతుడుగా రాణించి రచయితగా సాహిత్య ప్రపంచానికి పరిచితుడయ్యాడు. నరేంద్రనాథ్ స్నేహితుడు జాదూగోపాల్కు తమ్ముడు. అతన్ని కలిసి, ముచ్చటిస్తున్నప్పుడు నరేంద్రనాథ్ బదులు మానవేంద్రనాథ్ అని పేరు మార్చకోమని సహా ఇచ్చాడు. ఆ విధంగా నరేంద్రనాథ్ మరో అవతారం ఎత్తినట్లయింది.