ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ 2020 క్యాలెండర్ ఫొటోషూట్ కోసం నటి కియారా అడ్వాణీ హాట్ లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. డబూ రత్నానీ క్యాలెండర్ ఆవిష్కరణ తర్వాత చాలా మంది నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా కియారా ఫొటో గురించి విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కియారా ఓ ఆంగ్ల పత్రికవారు ఇంటర్వ్యూ చేయగా.. డబూ రత్నానీ క్యాలెండర్ ఫొటో షూట్ తర్వాత తాను సోషల్‌మీడియాలో నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేసుకున్నానని చెప్పారు. ‘నాకు సంబంధించిన పలు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యక్ష సందేశాలు (డైరెక్టివ్ మెస్సేజ్‌స్) నోటిఫికేషన్స్‌ను నేను ఆఫ్ చేశాను. ముఖ్యంగా డబూ రత్నానీ ఫొటోషూట్‌లోని నా ఫొటో విడుదలై అది వైరల్‌గా మారిన సమయంలో…’ అని కియారా పేర్కొన్నారు. డబూ రత్నానీ క్యాలెండర్ విడుదల అనంతరం కియారా ఫొటో వైరల్‌గా మారిన సమయంలో పలువురు నెటిజన్లు ఆమె ఫొటోపై పలు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు. ఆ సమయంలో ఆమె తన గురించి వచ్చిన పలు మీమ్స్‌ని తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. మీమ్స్ చాలా సరదాగా ఉన్నాయని అప్పట్లో ఆమె తెలిపారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘గిల్టీ’లో కియారా నటించారు. మార్చి 6న విడుదలైన ‘గిల్టీ’కి సినీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందాయి. ‘‘గిల్టీ’లో నేను నన్కీ అనే పాత్ర పోషించాను. ఇది విభిన్న కోణాలున్న, క్లిష్టమైన పాత్ర. నన్కీ నిరంతరం మాస్క్ ధరిస్తుంది. నా వ్యక్తిగత జీవితానికి నేను పోషించిన నన్కీ అనే పాత్రకి చాలా వ్యత్యాసం ఉంది. నన్కీ పాత్రలోని విభిన్న కోణాలను తెలుసుకుని అందులోకి పరకాయ ప్రవేశం చేయడం నాకెంతో ఆసక్తిగా అనిపించింది’ అని కియారా పేర్కొన్నారు.
అన్నీ ఆఫ్ చేశా
Related tags :