Movies

అతగాడు ఎవరో నాకు తెలీదు

Lavanya Tripathi Complains To Police On Fake Pakodis

కథానాయిక లావణ్య త్రిపాఠి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తనపై సునిషిత్‌ అనే వ్యక్తి అసత్య ప్రచారం చేస్తున్నాడని తన అసిస్టెంట్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడికి, తనకూ పెళ్లి జరిగిందంటూ యూట్యూబ్‌ ఛానెల్స్‌ ద్వారా ప్రచారం చేస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. దీనిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్‌ స్పందించారు. ‘యూట్యూబ్‌ ఛానెల్స్‌లో సునిషిత్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలించాం. ఆడవారిపై అసభ్యంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదు. సునిషిత్‌ ఇతర సెలబ్రిటీలపై కూడా వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు లావణ్య త్రిపాఠి మాత్రమే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నాం’ అని చెప్పారు. సునిషిత్‌ ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్నాడు. చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ పలు యూట్యూబ్‌ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ క్రమంలో తను, లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్నామని, బ్రేకప్‌ చెప్పుకొన్నామని, పెళ్లి జరిగిందని కూడా అన్నాడు. దాన్ని చూసిన ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు.