సైనా నెహ్వాల్ సైతం కరోనాపై స్పందించింది. తన భర్త పారుపల్లి కశ్యప్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. అందులో ఓ ఇటలీ యువకుడు కరోనా వైరస్ దశలను సమగ్రంగా వివరించాడు. ‘కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి, అందరం ఇళ్లలోనే ఉందాం. రాబోయే రెండు, మూడు వారాలు భారత దేశానికి ఎంతో కీలకం. ఇతర దేశాల్లోని అనుభవాల నుంచి మనమెంతో నేర్చుకోవాల్సి ఉంది. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోగలం’ అని సైనా ట్వీట్ చేసింది. భారత్‌లో ప్రస్తుతం 126 కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతిచెందారు.
ఇళ్లల్లో ఉండండి. భయపడకండి.
Related tags :