అమెరికా జాతీయ అంటురోగ నివారణ, పరిశోధన సంస్థ(NIAID-NIH), మోడెర్నా బయోటెక్నాలజీలు సంయుక్తంగా రూపొందించిన కొరోనా నిరోధక టీకాను అమెరికాలోని సియాటెల్ వైద్యులు సోమవారం నాడు 45 మంది స్వచ్ఛంద కార్యకర్తలపై విజయవంతంగా ప్రయోగించారు. నెలరోజుల విరామంతో రెండు విడతలుగా ఇచ్చే ఈ టీకాను అందుకున్న 43 ఏళ్ల మహిళ జెన్నిఫర్ హాలర్ మాట్లాడుతూ ప్రపంచాన్ని కుదుపేస్తున్న ఈ మహమ్మారిపై పోరుకు రూపొందించిన ఈ ఆయుధాన్ని తనపైన పరీక్షించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కైసర్ పెర్మానంటే ఆసుపత్రిలో ఈ టీకాలను డా.లీసా జాక్సన్ నేతృత్వంలో అందిస్తున్నారు. వీరిపై టీకా ప్రభావాన్ని అంచనా వేసిన అనంతరం సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికాలో 81మంది మృతి చెందగా సియాటెల్‌లో అత్యధికంగా 43మంది మరణించారు.
సియాటెల్‌లో మొదటి విడత కొరోనా టీకా
Related tags :