మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో షిరిడీ ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులు దర్శనానికి రాకూడదని తెలిపారు. కరోనా వైరస్ ప్రభావంతో మహారాష్ట్రలో షిరిడీ ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని సూచించారు. దేశంలో ఇప్పటికే 125కిపైగా కరోనా కేసులు నమోదుకాగా మహారాష్ట్రలో తీవ్రత అధికంగా ఉంది. అక్కడ ఇప్పటికే 39 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. అత్యధిక రద్దీ ప్రాంతాలు, ఆలయాల్లో కూడా ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ముంబయిలో ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయం సహా మరికొన్ని ఆలయాలను మూసివేశారు.
శ్రీశైలం క్షేత్రంపై కరోనా ప్రభావం ఈ నెల 22 నుంచి 26 వరకు శ్రీశైలం ఆలయంలో ఉగాది మహోత్సవాలు. కరోనా ఎఫెక్ట్ తో ఉగాది మహోత్సవాలలో వాహన సేవలు , స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ప్రభోత్సవం రథోత్సవం వీరచారి విన్యాసాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు : ఈవో కెఎస్ రామారావు. స్వామివారి ఆర్జిత అభిషేకాలు అమ్మవారి కుంకుమార్చనలు వృద్దమల్లికార్జునస్వామి అభిషేకాలు తాత్కాలికంగా నిలుపుదల : ఈవో కెఎస్ రామారావు. 12 సం లోపు చిన్న పిల్లలు , 60 సం దాటిన వృద్ధులు ఉగాది మహోత్సవాలలో శ్రీశైలం రావద్దని విజ్ఞప్తి : ఈవో కెఎస్ రామారావు