DailyDose

దర్గా వద్ద జెండా తగులబెట్టిన వ్యక్తి అరెస్ట్-నేరవార్తలు

Teliugu Crime News Roundup Today-Kavali Man Arrested

* నెల్లూరు జిల్లా కావలి జండా చెట్టు దర్గా దగ్గర జండాలు తగులు బెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసిన కావలి పోలీసులు.అర్ధరాత్రి కావలి జండా చెట్టు వద్దనున్న దర్గా లో షేక్ మస్తాన్ 49 వయస్సు గల వ్యక్తి ఫుల్ గ మద్యం సీవించి అర్ధ రాత్రి దాటిన తరువాత దర్గా దగ్గర హిందు ముస్లిం ఐక్యం గా పూజించే జండా లను తగులు బేత్టటం జరిగినదని దానిని గమనించిన షేక్ ఖాదర్ బాషా ఫిర్యాదు మేరకు అతనిని అరెస్ట్ చేయడం జరిగిందని, మరియు ముద్దాయి గురించి విచరణ చేయగా ఇతని భార్య చని పోయిందని ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు చనిపోయారని ఇతను కూలి పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తూ మతి స్థిమితం సరిగా లేదని కావలి డీఎస్పీ ప్రసాద్ గారు తెలిపి నారు. ఇతన్ని అరెస్ట్ చేసి కోర్ట్ కి హాజరు పరుస్తున్నము అని తెలిపారు.

* కర్నూలు జిల్లా ఆదోని, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన అదిమి మోహన్ కుమార్ వయసు28 ఆదోని పట్టణం టిజిల్ కాలనిలో గత కొద్దిరోజులుగా కాంట్రాక్టర్ అంటూ ఇల్లు అద్దెకు తీసుకొని మట్కా,గంజాయి,వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని, ఆదోని ఒకటవ పట్టణ పోలీసులకు రాబడిన సమాచారం ఆదోని డిఎస్పీ రామకృష్ణ సీఐ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు 16వతేదీన మధ్యాహ్నం ఎస్సై ప్రహ్లదుడు మరియు సిబ్బందితొ కలిసి దాడి చెసి సుమారు 66 వేలు నగదు 5,సెల్ ఫోన్లు 4 ఏటీఎం లు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని డిఎస్పీ రామకృష్ణ విలేకర్ల సమావేశంలో తెలిపారు అనంతరం సిబ్బందికి పారితోషికం అందించి అభినందించారు.

* వైసీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. గుంటూరు నల్లపాడు గ్రామానికి చెందిన వైసీపీ నేతలు హోంమంత్రి మేకతోటి సుచరిత నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. నగరపాలక సంస్థ వార్డు అభ్యర్థుల ఎంపికలో అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. పార్టీని అట్టిపెట్టుకుని పార్టీ కోసం పనిచేసే తమకు సీటు కేటాయించకుండా , అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తికి సీటు ఇవ్వడం పట్ల వైసీపీ నేతలు వివాదం తార స్థాయికి చేరింది. 27 వార్డు కార్పోరేట్ సీట్ న తమకే కేటాయించాలని లేని పక్షంలో స్వాతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తామని హెచ్చరించారు.

* పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పోలవరం గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. స్థానిక మెయిన్ రోడ్డులో గల శ్రీనివాస జనరల్ స్టోర్ యజమాని సింహాద్రి శ్రీనివాస్ ఇంట్లో దుండగులు 84 కాసుల బంగారం , 70 వేల రూపాయలు నగదు దోచుకెళ్లారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం చేసిన ప్రాంతాన్ని డిఎస్పీ వెంకటేశ్వర్ రావు , ఎస్.ఐ ఆర్.శ్రీను పరిశీలించి కేసును పరిశోధించారు.

* భీమడోలు మండలం ఫూళ్ళ ప్రభుత్వ హై స్కూల్ దగ్గర గల కాలువలో సుమారు 25 తొ 35 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చింది.ఎవరికయినా వివరాలు తెలిసిన ఎడల శీ భిమదొలె వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.