లవంగాలను మసాలా దినుసుగా మాత్రమే కాకుండా చాలా రకాలుగా ఉపయోగిస్తాం. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు లవంగాన్ని నోట్లో వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. కానీ లవంగాలలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం! దగ్గుకు సహజమైన మందు లవంగం. దగ్గుకే కాదు, శ్వాస సంబంధిత సమస్యలకూ అది బాగా పనిచేస్తుంది.లవంగాలను పొడిచేసి, నీళ్లలో తడిపి ఆ ముద్ద వాసన పీలిస్తే సైనస్ నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది.రోజూ తాగే టీలో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది. లవంగాలు పంటినొప్పినీ తగ్గిస్తాయి. అందుకే టూత్ పేస్టులలో ఎక్కువగా లవంగాలను వాడతారు. లవంగాలు ఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు. ఇవి వంటకాలకు మంచి సువాసనను, రుచినీ ఇస్తాయి.అంతేకాదు వాతావరణం మారినప్పుడల్లా వచ్చే మామూలు రుగ్మతలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఆహారంలో లవంగాన్ని వాడటం వలన ఒత్తిడి, అలసట, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొరోనాకు ఉపశమనం ఇచ్చే లవంగం
Related tags :