Food

గోరుచిక్కుడు రొట్టెలు చేసుకుందాం రండి

Goruchikkudu Rottelu - To All Corona Work From Home Ladies And Men - Telugu Special Recipes

*** కావలసినవి:
గోరుచిక్కుడుకాయలు: అర్ధపావు, బియ్యప్పిండి: 4 కప్పులు, ఉల్లిపాయలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు తురుము: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టీస్పూన్లు, జీలకర్ర: టీస్పూను, కారం: అరటీస్పూను, నూనె: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత

*** తయారుచేసే విధానం:
* ముందుగా గోరుచిక్కుడు కాయల్ని ఉడికించి ఈనెలు తీయాలి.
* ఓ గిన్నెలో బియ్యప్పిండి, గోరుచిక్కుడుకాయ ముక్కలు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, జీలకర్ర, ఉప్పు, కారం కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి ముద్దలా కలపాలి.
* ఇప్పుడు పిండిముద్దను మనకు కావాల్సిన సైజులో తీసుకుని చేత్తోనే రొట్టెలా వత్తుకుని పెనంమీద నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. వీటిని ఏదైనా చట్నీ లేదా టొమాటో సాస్‌తో తిన్నా ఎంతో రుచిగా ఉంటాయి.