అగ్ర కథానాయిక కాజల్ తన హృదయాన్ని కదిలించిన ఓ నిజ జీవిత సంఘటనను ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నారు. కరోనా వైరస్‌ను అరికట్టే నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల వల్ల కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వైరస్ వల్ల ఓ క్యాబ్ డ్రైవర్ కష్టపడుతున్నాడని, ఇది తెలిసిన తర్వాత తన గుండె పగిలిందని అన్నారు. ‘ఓ క్యాబ్ డ్రైవర్ నా ముందు నిల్చుని ఏడ్చాడు. గత 48 గంటల్లో నేనే తన మొదటి కస్టమర్ అని చెప్పాడు. కనీసం ఇవాళ అయినా నేను సరకులు తీసుకెళ్తానని నా భార్య అనుకుంటోందని అన్నాడు. ఈ వైరస్ మనల్ని అనేక విధాలుగా దెబ్బతీస్తోంది. కానీ రోజువారి ఆదాయం మీద జీవితం గడిపేవాళ్లు ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అతడికి రూ.500 ఎక్కువగా ఇచ్చా. మనలోని చాలా మందికి ఇలా ఇవ్వడం పెద్ద సమస్య కాదు. అంతేకాదు తన గత కస్టమర్‌ను వదిలిపెట్టిన తర్వాత దాదాపు 70 కిలోమీటర్లు డ్రైవింగ్ చేశానని అతడు చూపించాడు. దయచేసి మీ క్యాబ్ డ్రైవర్లకు, చిన్న దుకాణాలు పెట్టుకుని ఉన్న వారికి కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వండి. ఎందుకంటే.. ఆరోజుకి మీరే వాళ్ల చివరి కస్టమర్ కావొచ్చు’ అని రాసి ఉన్న పోస్ట్‌ను కాజల్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు.
ఒక ₹500 ఎక్కువ ఇచ్చాను
Related tags :