ఎప్పుడూ మిస్సైళ్ల పరీక్షలతో ప్రపంచాన్ని గడగడలాడించే.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు పార పట్టారు.
ప్యాంగ్‌యాంగ్‌లో కొత్త హాస్పటల్‌ను నిర్మించనున్నారు.
ఈ నేపథ్యంలో జరిగిన శంకుస్థాపన సెర్మనీలో కిమ్ పాల్గొన్నారు.
అక్కడ ఆయన చేతిలో పార పట్టుకుని .. హాస్పిటల్ నిర్మాణం కోసం తొవ్విన మట్టిని ఎత్తిపోశారు.
ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌తో వణికిపోతుంటే.. ఉత్తర కొరియా మాత్రం తమ దేశంలో ఆ వైరస్ కేసులేవీ నమోదు కాలేదు అని స్పష్టం చేసింది.
అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు హాస్పిటల్‌ను నిర్మిస్తున్నారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు.
కానీ మార్చి 17వ తేదీన జరిగిన కార్యక్రమంలో కిమ్.. తన చేతిలో ఉన్న పారతో మట్టిని ఎత్తిపోయడం అందర్నీ ఆశ్చర్యానికి లోను చేసింది.
కొరియాకు చెందిన వర్కింగ్ పార్టీ 75వ వార్షికోత్సవం కోసం ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు భావిస్తున్నారు.
ప్రజా ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టపరుచాలని కిమ్ అన్నారు.
అయితే మాస్క్ ధరించుకుండానే.. కిమ్ తన చేతిలో షావెల్‌తో మట్టిని తోడారు.
ఇప్పటి వరకు దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా పేర్కొన్నది.
కానీ మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.