Movies

ఏడు రోజులు ఆల్ బంద్

MP Mimi Chakravarthy Under House Arrest

భారత్‌లో కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణం ముగించుకుని ఇండియా చేరుకున్న పలువురు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. తాజాగా బెంగాలీ నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మిమి చక్రవర్తి కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తన తాజా చిత్రం బాజి షూటింగ్‌ కోసం లండన్‌కు వెళ్లిన మిమి చక్రవర్తి మంగళవారం ఇండియా చేరుకున్నారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవడంతోపాటు, కరోనా వైరస్‌కు సంబంధించి ఇతర ఫార్మాలిటీలను కూడా పూర్తి చేశారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా 7 రోజుల పాటు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు మిమి చక్రవర్తి ప్రకటించారు. ఈ 7 రోజులు పాటు ఎవరిని కలవకూడదని నిర్ణయం తీసుకున్నారు.