* చైనాలో విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు 165 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 98 వేల 426 మందికి కరోనా సోకగా, 7,987 మంది మృతి చెందారు. చైనాలో కరోనా మృతుల సంఖ్య 3,237కు చేరింది. ఇటలీలో 2,503 మంది, ఇరాన్లో 988, స్పెయిన్‌లో 533, ఫ్రాన్స్‌లో 175, అమెరికాలో 115, దక్షిణ కొరియాలో 84, యూకేలో 71, నెదర్లాండ్స్‌లో 43, జపాన్‌లో 29 మంది మృతి చెందారు. భారత్‌లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
* కరోనా భయంతో జనం జడుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కరోనాకు ముందస్తు జాగ్రత్తలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ జనం ఎక్కువగా గుమికూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇంకా షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద ఈవెంట్లను కూడా రద్దు అవుతున్నాయి. ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు చేస్తున్నాయి.
* రపంచాన్ని వణికిస్తున్న కరోనా విధ్వంసంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పలు దేశాలు ఈ మహమ్మారి బారినపడి విలవిలలాడుతున్నాయి. కరోనా విజృంభణపై లండన్ ఇంపీరియల్ కాలేజ్ జీవగణితం ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ నేతృత్వంలోని బృందం చేపట్టిన అథ్యయనం మహమ్మారి ఏస్ధాయిలో మానవాళిని కబళిస్తుందో కళ్లకు కట్టింది. కరోనా భారీగా విస్తరించిన ఇటలీలోని తాజా డేటాను విశ్లేషిస్తూ ఈ అథ్యయనం రాబోయే రోజుల్లో పరిణామాలను అంచనా వేసింది. కొవిడ్-19ను 1918లో వ్యాపించిన ఫ్లూతో పోల్చిన అథ్యయనం కరోనాను కట్టడి చేసే చర్యలు కొరవడటంతో అమెరికాలో 22 లక్షల మంది, బ్రిటన్‌లో 5 లక్షల మంది మరణిస్తారని పేర్కొంది.
* ఇరాన్లో చిక్కుకున్న దాదాపు 254 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్లో ఆదివారానికి 13,938 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, 724 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు వెళ్లిన జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలకు చెందిన 1,100 మంది యాత్రికుల బృందంలో 254 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. విదేశాల్లోని భారతీయుల యోగక్షేమాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ కొత్తగా ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది
* కరోనా వైరస్ వ్యాప్తిపై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.’పారాసిటిమల్ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా చచ్చిపోతుందని వైఎస్ జగన్ గారు సెలవిచ్చారు.అసలు కరోనా పెద్ద విషయమే కాదు అన్న జగన్ గారు ఆయన ఇద్దరు కుమార్తెలను లండన్ నుండి ఎందుకు వెనక్కి పిలిపించారు?’ అని ప్రశ్నించారు.’అంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు. రాష్ట్రంలో ఉన్న పిల్లలు కరోనా బారిన పడినా ఫర్వాలేదు.జగన్ గారి కుటుంబం మాత్రం హాయిగా తాడేపల్లి కోటలో సురక్షితంగా ఉండాలి. జగరోనా కి ఇంత స్వార్థమా?’ అని నిలదీశారు.
* కరోనా వైరస్ దృష్ట్యా భాజపా కీలక నిర్ణయం తీసుకుంది.ఒక నెల పాటు ఎలాంటి నిరసనలు, ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించారు.ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఏప్రిల్ 15 వరకు ప్రదర్శన కార్యక్రమాలకు దూరంగా ఉండి.. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నడ్డా స్పష్టం చేశారు.ఏదైనా చెప్పాలంటే పార్టీ సీనియర్ నేతలను సంప్రదించాలని భాజపా శ్రేణులకు సూచించారు.
* భారత్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.ఇప్పటి వరకు భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 147కు చేరింది.ఓ భారత జవాన్‌కు కూడా కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది.బాధిత జవాను తండ్రి ఫిబ్రవరి 27న ఇరాన్ నుంచి లఢఖ్‌కు తిరిగి వచ్చాడు.కరోనా లక్షణాలు కనిపించడంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో జవాన్ తండ్రిని ఫిబ్రవరి 29 నుంచి మార్చి 6వ తేదీ వరకు లఢఖ్ హార్ట్ ఫౌండేషన్‌లోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అయితే జవాన్ సాధారణ సెలవు మీద ఇంటికెళ్లిన సమయంలోనే ఇరాన్ నుంచి ఆయన తండ్రి వచ్చాడు. దీంతో జవాన్‌కు కూడా కరోనా సోకింది.
* కరోనాతో ఇటలీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.80ఏళ్లకు పైబడినవారికి చికిత్సకు ప్రభుత్వం నో చెబుతుంది.కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే వృద్ధులకు రెండో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.ఇటలీలో 27వేల మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.ఇప్పటివరకు ఇటలీలో 2,158 మంది మృతి చెందారు.ఇటలీలో 6కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమైయ్యారు.