ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్ దాఖలుపై ఎన్నారై తెరాస బహరేన్, లండన్ శాఖలు హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నారై తెరాస బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ కవితకు అభ్యర్థిత్వాన్ని అందించిన కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణా జాగృతి అధ్యక్షురాలిగా ఆమె సేవలను కొనియాడారు. యుకె ఎన్నారై తెరాస సలహా మండలి ఉపాధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రానికే గాక ఎంపీగా దేశానికి సేవ చేసిన నాయకురాలు కవిత అని, ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని నిజామాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కవితకు ఎన్నారై తెరాస మద్దతు
Related tags :