శ్రీవారి దర్శనం పేరుతో తిరుపతికి వచ్చి హోటల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్ సీఐ బీవీ శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఐ జయచంద్ర వివరాల మేరకు.. కదిరికి చెందిన జయరాం నాయుడు కుమారుడు శ్రీధర్(38) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో సంస్థ విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత ఉద్యోగం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 14 రాత్రి తిరుపతి వెళుతున్నానని హైదరాబాద్‌లో ఉన్న భార్య, కుమారుడికి చెప్పి వచ్చాడు. ముందుగా ఆన్‌లైన్‌లో హోటల్‌లో గదిని తీసుకున్నాడు. ఏ హోటల్‌లో ఉంది కుటుంబసభ్యులకు చెప్పాడు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఫోన్ తీయకపోవడంతో హోటల్‌కు కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. వారు వెళ్లి తలుపులు తట్టినా తెరవకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా.. ఫ్యాన్‌కు బెడ్‌షీట్ సహాయంతో ఉరివేసుకుని వేలాడుతున్న శ్రీధర్‌ను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తండ్రి, ఇద్దరు అన్నలకు మృతదేహాన్ని అప్పగించారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆత్మహత్య
Related tags :