* ఇప్పటి వరకు తెలంగాణ గడ్డపై ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, కేవలం ఇతర దేశాల నుంచి వచ్చివ వారికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనాకు సంబంధించి ఎక్కడా రాజీపడకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులు ఏవైనా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు మంత్రి ఈటల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు సెలవులు ప్రకటించింది ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటారని తప్ప ప్రయాణాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనకు కాదని ఈ సందర్భంగా మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైరస్ బారిన పడకుండా పిల్లలను చూసుకునే బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదేనన్నారు.
* దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం జరిగిన ఘటనల్లో నమోదైన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆ సమయంలో ముఖ్యంగా రిలయన్స్ దుకాణాలపై దాడులకు సంబంధించి నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
* స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును సైతం వైకాపా నేతలు వక్రీకరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో కరోనా విస్తరణ వల్లే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను వాయిదా వేసిందన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కరోనా వైరస్‌పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వైరస్ నియంత్రణపై వైకాపా ప్రభుత్వానికి అసలు బాధ్యత ఉందా అని ప్రశ్నించారు.
* మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ నిల్వల వివరాలు సమర్పించని సంస్థలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయా వస్తువుల ఉత్పత్తిదారులు, దిగుమతిదారులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అందుకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ ఈ హెచ్చరికను జారీ చేసింది. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందరికీ అందుబాటులోకి ఉండేందుకు, వాటి ధరలు, అమ్మకాలలో అక్రమాలను నివారించేందుకు ఈ వస్తువులను నిత్యావసరాలుగా ప్రకటించింది.
* స్థానిక ఎన్నికల నేపథ్యంలో విధించిన ఎన్నికల కోడ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సడలించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోడ్ సడలింపునకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టులో బుధవారం జరిగిన విచారణకు సంబంధించిన తీర్పు కాపీ విడుదలైంది. తీర్పు కాపీలో విచారణలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను పేర్కొంది. స్థానిక ఎన్నికల వాయిదాపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
* ప్రస్తుతం దేశంలో ఎక్కడచూసినా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు విస్తరించిన కరోనా వైరస్‌తో ప్రజలు తమ దూర ప్రయాణాలను కూడా రద్దు చేసుకుంటున్నారు. విదేశీ ప్రయాణం చేసివచ్చిన వారిని కొన్నిరోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంత అప్రమత్తంగా ఉన్న సమయంలో ‘హోం క్వారంటైన్’ కావాల్సిన కొందరు వ్యక్తులు రైల్లో ప్రయాణం చేయడం కలకలంరేపింది. ఇది గమనించిన సిబ్బంది వారిని అక్కడే రైలు నుంచి దించేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.
* ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. వైరస్ బాధితులకు చికిత్సలు చేసిన వైద్యులను సైతం కరోనా విడిచిపెట్టడం లేదు. వైరస్ బాధితులతో పాటు వైద్యులు కూడా స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. అయినా, వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. ఈమేరకు ఓ వైద్యుడి భార్య ఈ వైరస్ తమ జీవితాలను మార్చేసిన విధానాన్ని ట్విటర్లో పంచుకున్నారు. ఇప్పుడు ఆ ట్వీట్లు నెటిజన్లను కదిలిస్తున్నాయి. అమెరికాకు చెందిన రాచెల్ పాట్జెర్ భర్త ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఆమె రెండు వారాల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే, ఆ బిడ్డను తన భర్త కనీసం తాకనైనా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
* వచ్చే త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లలో కోత విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో ద్రవ్య పరపతి విధాన వడ్డీరేట్ల కోత బదిలీ త్వరగా జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంకు డిపాజిట్ వడ్డీ రేట్లు హేతుబద్ధీకరించినప్పటికీ ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ) వంటి చిన్న మొత్తాల వడ్డీరేట్ల జోలికి పోలేదు.
* రెండు ప్రపంచకప్‌లు గెలిచిన తన సారథ్యంలో 2008లోని ‘మంకీ గేట్’ వ్యవహారమే అత్యంత ఘోరమైందని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు. అది చోటు చేసుకున్నప్పుడు పరిస్థితులు తన నియంత్రణలో లేకుండా పోయాయని వెల్లడించాడు. సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌పై టీమ్‌ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
* మహారాష్ట్రలో కరోనా విజృంభణ కారణంగా అక్కడి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు విద్యాసంస్థలు మూతపడగా తాజాగా ఐఐటీ బాంబేను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. మార్చి 31 వరకు క్యాంపస్‌ను మూసివేస్తున్నామని, విద్యార్థులు కూడా రెండురోజుల్లో హాస్టళ్లు ఖాళీ చేయాలని ఆదేశించింది. క్యాంపస్‌లోకి ఏ ఒక్కరినీ అనుమతించబోమని, కొందరు విదేశీ విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.