NRI-NRT

అమరావతి రైతులకు ₹15లక్షల70వేల చెక్కు అందజేసిన ప్రవాసాంధ్రులు

అమరావతి రైతులకు ₹15లక్షల70వేల చెక్కు అందజేసిన ప్రవాసాంధ్రులు-Telugu NRIs Donate 15lakhs To Amaravati Farmers Protest

గత 3నెలలుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనకు అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రులు తమ మద్దతును ప్రకటించారు. ఈ ఉద్యమానికి తమవంతు విరాళంగా ₹15లక్షల 70 వేల రూపాయిలను బుధవారం నాడు అమరావతిలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్న రైతులు JAC నాయకులకు ఉదయం 11గంటలకు చంద్రబాబు చేతుల మీదుగా అందచేశారు. తెదేపా జాతీయ కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విరాళాలను అమెరికా అంతటా ఉన్న ప్రవాసాంధ్రుల వద్ద నుండి సేకరించే కార్యక్రమాన్ని మల్లినేని ఠాగూర్, బొలినేని సాయి, గుమ్మడి రత్నప్రసాద్ తదితరులు సమన్వయపరిచి అమెరికాలోని ఎన్నారైలు జువ్వా వెంకట్, ప్రేమ్ అక్కినేని, శివ పులివర్తి, భరత్ మన్నెం, రఘురాం చిట్టూరి, శ్రీ సురెడ్డి, శరత్ భావినేని, ముసునూరు తదితరులు చేతుల మీదగా ₹15లక్షల 70 వేల రూపాయిలను అమరావతిలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్న రైతులు JAC నాయకులకు అందచేశారు.