విధివంచిత నిర్భయకు భారతదేశంలో ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు న్యాయం దొరికింది. భారత న్యాయవ్యవస్థలోని అన్ని లొసుగులను సంధిస్తూ నిందితులు వేసిన ఎత్తుగడలు యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి,ఆగ్రహానికి గురిచేసినా శుక్రవారం ఉదయం 5:30గంటలకు వీరిని మృత్యుపాశం ముద్దాడింది. ఇది దేశమహిళలందరికీ గర్వకారణమని, తన బిడ్డకు నేడు నిజమైన న్యాయం జరిగిందని నిర్భయ తల్లి ఆశాదేవి తీహాడ్ జైలు వద్ద ఆనందం వెలిబుచ్చారు. ఢిల్లీలోని తీహార్ జైలులో వీరిని ఉరికంబానికి అరగంట పాటు వేలాడదీసిన అనంతరం పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేస్తారు.
అంతకుముందు గురువారం విచారణ సమయంలో నేరం జరిగినప్పుడు తాను దిల్లీలో లేనంటూ దోషి ముకేశ్ సింగ్ చేసిన వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. చట్టపరమైన అన్ని అవకాశాలు మూసుకుపోయాయని, ఈ దశలో కొత్త వాదనలకు అవకాశం లేదని జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తాను సమర్పించిన రెండో క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఇంకో దోషి అక్షయ్ కుమార్ పెట్టుకున్న దరఖాస్తును కూడా ఇదే ధర్మాసనం తిరస్కరించింది. మరో నిందితుడు పవన్ కుమార్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి.రమణ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం తిరస్కరించింది.
మరోవైపు ఉరిశిక్షను అమలు చేయాలన్న పటియాలా హౌస్‌కోర్టును తీర్పును సవాలు చేస్తూ.. అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్త, వినయ్ శర్మలు వెంటనే దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వీరికి ఎదురుదెబ్బే తగిలింది. పటియాలా హౌస్ కోర్టు తీర్పును సమర్థిస్తూ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్‌ల ద్విసభ్య ధర్మాసనం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో తీర్పు వెలువరించింది. యథాతథంగా ఉరి శిక్ష అమలు చేయాలని తేల్చి చెప్పింది. దీంతో నిర్భయ దోషులు అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ సుప్రీం తలుపులు తట్టారు. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. ఉరిని యథాతథంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది.
నిర్భయ దోషులకు ఉరిశిక్ష నిలుపుదలకు చివరి వరకు విఫలయత్నాలు. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు గురువారం చివరి క్షణం వరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు..వారు దాఖలు చేసిన పిటిషన్లంటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయి..దీంతో దోషులైన ముకేశ్ సింగ్, పవన్ గుప్త , వినయ్ శర్మ , అక్షయ్ కుమార్ సింగ్ లను తిహార్ జైలులో ఉరితీశారు..పలువురు జైలు అధికారులతోపాటు, జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో ఇవాళ ఉదయం 5.30 గంటలకు తలారి పవన్ జల్లాద్ ఈ ప్రక్రియను పూర్తి చేశారు.అంతకుముందు గురువారం విచారణ సమయంలో నేరం జరిగినప్పుడు తాను దిల్లీలో లేనంటూ దోషి ముకేశ్ సింగ్ చేసిన వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు..చట్టపరమైన అన్ని అవకాశాలు మూసుకుపోయాయని, ఈ దశలో కొత్త వాదనలకు అవకాశం లేదని జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.తాను సమర్పించిన రెండో క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఇంకో దోషి అక్షయ్ కుమార్ పెట్టుకున్న దరఖాస్తును కూడా ఇదే ధర్మాసనం తిరస్కరించింది..మరో నిందితుడు పవన్ కుమార్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి.రమణ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం తిరస్కరించింది.మరోవైపు ఉరిశిక్షను అమలు చేయాలన్న పటియాలా హౌస్‌కోర్టును తీర్పును సవాలు చేస్తూ.. అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్త, వినయ్ శర్మలు వెంటనే దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు..అక్కడ కూడా వీరికి ఎదురుదెబ్బే తగిలింది.పటియాలా హౌస్ కోర్టు తీర్పును సమర్థిస్తూ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్‌ల ద్విసభ్య ధర్మాసనం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో తీర్పు వెలువరించింది..యథాతథంగా ఉరి శిక్ష అమలు చేయాలని తేల్చి చెప్పింది..దీంతో నిర్భయ దోషులు అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ సుప్రీం తలుపులు తట్టారు..ఉరిశిక్షపై స్టే విధించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు..దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది..ఉరిని యథాతథంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది.నిర్భయ కేసులో నిందితులను ఉరితీసిన తలారీ పవన్ జల్లాద్..నలుగురు నిందితులను ఒకేసారి ఉరితీసిన తలారీ..నలుగురికి ఒకేసారి తీయడం దేశ చరిత్రలో లో మొదటిసారి..ఉరికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించిన జైలు అధికారులు..5:30 గంటలకు ఉరి తీసిన తలారీ..ఉరికి రెండు గంటల ముందు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నిందితుల తరుపు న్యావాది..ఉరి వాయిదాకు చివరి వరకు ప్రయత్నం చేసిన నిందితులు..నిందితులకు ఉరి అమలు కావడంతో నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు..లేట్ అయినా నా చివరకు న్యాయం జరిగింది నిర్భయ తల్లి ఆశాదేవి..గంట పాటు కొనసాగిన ఉరి అమలు ప్రక్రియ..తీహార్ జైలు వద్ద స్థానికులు సంబరాలు జరుపుకుంటున్నారు..