Politics

తెలంగాణాలో వేడుకలు బంద్

CM KCR Bans All Celebrations In Telangana

కరీంనగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 కరోనా పాజిటివ్‌ కేసులు గుర్తించినట్లు స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం ప్రగతిభవన్‌లో మీడియాతో కేసీఆర్‌ మాట్లాడారు. మార్చి1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను రానున్న రెండు మూడు రోజుల్లో గుర్తించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు లేవని.. అయినా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం సూచించారు. చైనా పక్కనే ఉన్న వియత్నాం తొలి నుంచీ కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యలు పాటించడంతో అక్కడ ఎలాంటి కేసులూ నమోదు కాలేదని ఈ సందర్భంగా కేసీఆర్‌ గుర్తు చేశారు.