‘గుమ్కి’, ‘సుందరపాండియన్’, ‘కొంబన్’ చిత్రాలతో అగ్రనాయికగా ఎదిగిన నటి లక్ష్మీమేనన్. చివరగా 2015లో విజయ్‌సేతుపతితో కలసి ‘రెక్క’ చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అనంతరం గౌతంకార్తిక్‌తో ‘సిపాయ్’, ప్రభుదేవాతో ‘యంగ్ మంగ్ సంగ్’ చిత్రాల్లో జోడీ కట్టింది. ఈ రెండు చిత్రాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో గౌతం కార్తిక్‌తో మళ్లీ ఓ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ముత్తయ్య దర్శకత్వంలో కొంబన్, కుట్టిపులి చిత్రాలు చేసిందీ కేరళ కుట్టి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. దీని గురించి ముత్తయ్య మాట్లాడుతూ.. ‘‘ కొత్త సెంటిమెంట్ అంశాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. గౌతం, లక్ష్మీమేనన్ కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తప్పకుండా చక్రం తిప్పుతారు. ఈ చిత్రంతో ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటుందని’’ పేర్కొన్నారు.
లక్ష్మీ మేనన్ మళ్లీ వస్తోంది
Related tags :