చావంటే భయం లేదని, అందుకోసం ఎదురుచూస్తున్నానని ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అన్నాడు. ‘ద స్పోర్ట్స్‌మన్’ అనే వెబ్‌సైట్‌తో మాట్లాడిన ఆయన.. జీవితమంటే పోరాటమని చెప్పాడు. మన గురించి ఎంత తెలుసుకుంటామో జీవితం గురించి అంతే తెలుసుకుంటామని తెలిపాడు. ‘జీవితం చాలా ఆసక్తిగా ఉంటుంది. మనకు తెలియకుండానే పుట్టాము. ఎక్కడి నుంచి వచ్చామో కూడా తెలియకుండానే కన్నుమూస్తాము. కానీ, మన జీవితం.. చావుకు సిద్ధం చేస్తుంది. దాని గురించి మనకు తెలియకున్నా.. ఒక వయసు వచ్చాక చావంటే భయం ఉండదు’ అని మాజీ బాక్సర్ చెప్పాడు. చావుతో సమానమైన బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం భయమనిపించలేదా అని అడిగిన ప్రశ్నకు అస్సలు భయమనిపించలేదని వెల్లడించాడు.
నాకు చావుభయం లేదు
Related tags :