Health

కొరోనా నేపథ్యంలో శ్రీవారి దర్శనాలు రద్దు-TNI ప్రత్యేక కథనాలు

New Corona Case In Ongole-TTD Cancels Darshan-TNILIVE Corona Special Stories

* ✍ఇప్పటికి వరకు తిరుమలలో ఉన్న భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం
✍అలిపిరి తనిఖీ కేంద్రం, నడక దార్లను మూసివేసిన టిటిడి
✍రాష్టంలోని అన్ని ప్రముఖ ఆలయాలు మూసివేయాలని ప్రభుత్వ నిర్ణయం
✍రేపు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి ఆలయం మూసివేత
✍శ్రీవారికి ప్రతి రోజు నిర్వహిస్తున్న అన్ని సేవలు ఏధా విధిగా నిర్వహణ

* ?ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ మూసివేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.
?రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయ దర్శనాలు నిలిపివేత.
? కరోనా కట్టడికి కోసం ప్రభుత్వం తీసుకున్నట్లు చర్యలు.
? వివాహాలు కూడా రద్దు చేసుకోవాలని ప్రజలకు హితవు.

* ఈ నెల 20వ తేదీ శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలేశుని దర్శనానికి భక్తులను అనుమతి నిలిపివేత – ప్రస్తుతం తిరుమలకు వచ్చి ఉన్నవారికే మాత్రమే దర్శన అవకాశం .- తదుపరి నిర్ణయం తీసుకునే వరకు స్వామి వారికి అన్ని సేవలు ఏకాంతంగా నిర్వహణ – కరోనా సమస్య పై టి టి డి అధికారవర్గం కీలక నిర్ణయం.

* కరోనా కట్టడికి సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం:
? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్
? హోటల్స్ మూసివేసే యోచన
? రవాణ మార్గాలపై ఆంక్షలు విధించే అవకాశం
? పలు మార్గాల్లో ఆర్టీసీ బస్సులు నిలిపివేసే ఛాన్స్
? అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దంటున్న ప్రభుత్వం
? ప్రభుత్వ కార్యాలయాల్లో కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశం
? ఫిబ్రవరి, మార్చిలో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరణ
? గ్రామ స్థాయి నుంచే సమాచారం సేకరిస్తున్న ప్రభుత్వం

* కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం సెలవులు వదలడంతో కళ్యాణదుర్గంలో ఓ కుటుంబంలో విషాదంకళ్యాణదుర్గం పట్టణ శివార్లలో ని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పంప్ హౌస్ వద్ద నీటి కుంటలో తన ఇద్దరు పిల్లలకు ఈత నేర్పించడానికి వెళ్లిన మహమ్మద్ రఫీ దుర్మరణం.తన ఇద్దరు కొడుకులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లి నీటి కుంట లోని మట్టిలో కూరుకుపోయిన మహమ్మద్ రఫీ.పిల్లలకు ఈత నేర్పించడానికి వెళ్లిన మహమ్మద్ రఫీ శవమై తేలడంతో అనాథగా మారిన భార్య, ఇద్దరు పిల్లలు

* ఆ ఇంటినుంచి ఎవరు బైటకొచ్చిన స్ప్రే కొట్టాల్సిందే.ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా వైరస్ బాధితుడి ఇంటి ముందు మున్సిపల్ అధికారులు మకాం పెట్టారు.ప్రస్తుతం కరోనా బాధితుడిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే అతని ఇంటి ముందు మాత్రం ఇలా షిఫ్ట్ లవారీగా తమ సిబ్బందిని నిలబెట్టి లోపలికి వెళ్లి, బయటకు ఎవరొచ్చినా వారిపై యాంటీబయోటిక్స్ స్ప్రే చేయాలని సూచించారు.ప్రస్తుతం ఒంగోలులోని ఆ ఏరియా అంతా కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నట్టు కనిపిస్తోంది.

* ఆరోగ్య బీమా వర్తింపు రోగాల జాబితాలోకి చేరిన కరోనా. కరోనా కు ఆరోగ్యబీమా అమలుచేస్తూ నిర్ణయం తీసుకున్న ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మెడికల్ క్లెయిమ్స్ కు అవకాశం.

* రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది.ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండుకు చేరింది.ఈనెల 12న లండన్‌ నుంచి బయలుదేరిన ఆయన 15న ఒంగోలు చేరుకున్నారు.జలుబు, దగ్గు, జ్వరం ఉండటంతో కరోనా అనుమానంతో ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో చేశారు.వెంటనే శాంపిల్స్‌ తీసుకున్న వైద్యులు తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.బుధవారం రాత్రి వచ్చిన రిపోర్టుల్లో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది.బాధితుడి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.రాష్ట్రంలో మరో పాజిటివ్‌ కేసు నమోదవడంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు ఒంగోలు ప్రభుత్వాస్పత్రి వైద్యులను అలెర్ట్‌ చేశారు.ఇప్పటికే నెల్లూరులో ఒక పాజిటివ్‌ కేసు నమోదవగా బాధితుడికి అక్కడి ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు.మరోవైపు బుధవారం మరో ముగ్గురు అనుమానితులు ఆస్పత్రుల్లో చేరారు.రాష్ట్రంలో ఇప్పటివరకూ 105 మంది శాంపిల్స్‌ పరిశీలించగా 96 నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయి.రెండు పాజిటివ్‌ రాగా, మరో ఏడుగురి రిపోర్టు రావాల్సి ఉంది.శుక్రవారం సాయంత్రానికి మిగిలిన కేసులకు సంబంధించిన రిపోర్టులు రానున్నాయి.