DailyDose

రేపే నిర్భయ దోషుల ఉరి-నేరవార్తలు

Nirbhaya culprits to be hanged tomorrow

* డీజీపీని కలసిన వైసీపీ ఎమ్మెల్యేలునిన్న ఎస్ఈసీ రమేష్ కుమార్ పేరుతో సర్క్యులేట్ చేసిన లేఖపై ఫిర్యాదుప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలో భాగంగా లేఖను సర్క్యులేట్ చేశారని ఫిర్యాదుఆ లేఖ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని డీజీపీని కోరిన ఎమ్మెల్యేలుపలువురు మీడియా ప్రతినిధుల పాత్ర కూడా ఉందని డీజీపీకి తెలిపిన ఎమ్మెల్యేలు..లేఖతో పాటు జరుగుతున్న పరిణామాలపై కీలక సమాచారాన్ని డీజీపీకి అందించిన ఎమ్మెల్యేలుడీజీపీని కలిసిన వారిలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్, కైలే అనిల్ కుమార్, పార్థసారథి, మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు.

* నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు ఇలా

⦁ సూపరింటెండెంట్​, డిప్యూటీ సూపరింటెండెంట్​, ఇంఛార్జ్​ వైద్యాధికారి​, రెసిడెంట్ వైద్యాధికారి, జిల్లా కలెక్టర్​ లేదా అదనపు కలెక్టర్​ సమక్షంలో ఉరిశిక్ష అమలవుతుంది.

⦁ ఉరిశిక్ష అమలుకు ఒక్కరోజు ముందు ఉరితాళ్లతో పాటు ఉరికంబాన్ని పరీక్షించే ప్రక్రియను జైలు సూపరింటెండెంట్ దగ్గరుండి పర్యవేక్షిస్తారు.

⦁ అనంతరం ఖైదీల బరువుకు 1.5 ఇంతలు బరువుండే ఇసుక బస్తా​ను ఉరికంబం నుంచి 1.830 నుంచి 2.440 మీటర్ల వరకు కిందకు వదిలి ఉరితాడును పరీక్షిస్తారు.

⦁ ఉరిశిక్ష అమలు ప్రాంతంలో 10 మందికి తక్కువ కాకుండా కానిస్టేబుళ్లు, వార్డెన్లు, ఇద్దరు హెడ్​ కానిస్టేబుళ్లు, హెడ్​ వార్డెన్లు, అదే సంఖ్యలో జైలు సాయుధ గార్డులు ఉంటారు.

⦁ ఉరిశిక్షను చూసేందుకు దోషుల కుటుంబసభ్యులను అనుమతించరు.

⦁ ఒకవేళ ఖైదీ కోరుకుంటే అతనికి నమ్మకమున్న పూజారిని ఉరిశిక్ష చూసేందుకు అనుమతిస్తారు.

⦁ ఒకరి ఉరిశిక్ష పూర్తయి, మృతదేహాన్ని ఉరికంబం నుంచి తీసేంత వరకు మిగతా దోషులను జైలు గదుల్లోనే ఉంచుతారు.

⦁ ఖైదీల ఆరోగ్య పరిస్థితిని ఉరిశిక్ష తేదీకి నాలుగురోజుల మందే డాక్టర్లు పర్యవేక్షిస్తారు. ఖైదీని ఉరికంబం నుంచి కిందకు ఎంత దూరం వేలాడదీయాలో వైద్యులే సూచిస్తారు.

⦁ ఒక్కో ఖైదీకి రెండు జతల ఉరితాళ్లు సిద్ధం చేస్తారు. వాటిని పరీక్షించిన అనంతరం తాళ్లతో పాటు ఇతర ఉరి సామగ్రిని స్టీలు పెట్టె​లో పెట్టి తాళం వేస్తారు. ఆ పెట్టెను జైలు సూపరింటెండెంట్​ ఆధీనంలో ఉంచుతారు.

⦁ సూపరింటెండెంట్​, జిల్లా కలెక్టర్​, వైద్యాధికారి బృందం ఉరిశిక్ష అమలయ్యేనాటి ఉదయమే ఖైదీలను పర్యవేక్షిస్తారు.

⦁ ఉరికంబాన్ని ఎక్కేముందు.. ఖైదీలు ఉరితాడును చూడకుండా అతని ముఖాన్ని గుడ్డతో కప్పేస్తారు.

⦁ ఉరికంబంపై జైలు వార్డెన్లు ఖైదీని పట్టుకుని ఉంటారు. ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్​ ఆదేశానుసారం ఉరిశిక్ష అమలు చేస్తారు.

⦁ పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తారు.

⦁ ఖైదీల మృతదేహాలను స్మశానవాటికకు తరలించేందుకు అంబులెన్స్​ను వినియోగిస్తారు.

* ఈరోజు సాయంత్రం సుమారు 3.00 గం. ల సమయంలో రొంపిచర్ల మండలంలోని సంతగుడిపాడు గ్రామ పరిధిలో ఒక కారు డ్రైవర్ తన కారు త్స్ 03 ఆఝ్ 4336 ని హైదరాబాద్ నుండి చెన్నై కి అద్దంకి- నర్కెట్పల్లి స్టేట్ హైవే పై వెళుతూ, అతివేగముగా నడుపుతూ కుక్క అడ్డు రావడంతో బ్రేక్ వేయగా కారు అదుపు తప్పి ప్రమాదానికి గురై పొలంలోకి పల్టీ కొట్టినది. ఎయిర్ బెలూన్ ఓపెన్ అవ్వటంతో ప్రాణహాని జరగలేదు. వివరాలు తెలియాల్సి ఉంది.

* పట్టాభిపురం భాగ్యనగర్ లో దారుణ హత్యఅక్రమ సంబంధం నేపధ్యంలో ఓ యువకుడు హత్యరోకలి బండ తో యువకుడిని హతమార్చిన మంగరాజు, పుల్లయ్య. మృతి చెందిన యువకుడు షేక్ నాగ కుమార్ గా గుర్తించిన పోలీసులు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ శవగారానికి తరలించిన పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పట్టాభిపురం పోలీసులు.

* పట్టాలు తప్పిన MMTSహఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ దగ్గరలో పట్టాలు తప్పిన MMTS ట్రైన్..లింగంపల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న MMTS..భయాందోళనకు గురయిన ప్రయాణికులు..విజయనగరం వి.టి.అగ్రహారంలోని పరిశ్రమల ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం. ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నా అదుపులోకి రాని అగ్ని జ్వాలలు. దట్టమైన పొగ, ఎగసిపడుతున్న మంటలతో భయాందోళన చెందుతున్న పరిసర ఇళ్లలోని ప్రజలు..ఈ ఘటన తో మూడు గంటలు ఆలస్యంగా నడువనున్న పలు రైళ్లు..లింగంపల్లి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన రైళ్లు 3 గంటలు ఆలస్యంగా నడుస్తాయని తెలిపిన అధికారులు..

* కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బొల్లారం గ్రామ సమీపంలోని ఊరు చెరువులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ మాలోత్ రమేష్ స్వల్ప గాయాలు కావడంతో గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే పర్మల్ల తండాకు చెందిన ఒక ట్రాక్టర్ ఇసుక నింపుకొని బొల్లారం మీదుగా జప్తి జనకంపల్లి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బొల్లారం గ్రామ ఊర చెరువులో అదుపు తప్పి పడిపోవడంతో వెంటనే గ్రామస్తులందరూ సంఘటన స్థలానికి చేరుకొని జేసీపీ సహాయంతో ట్రాక్టర్ కు బయటకు తీశారు.ఈ ప్రమాదం అతివేగంగా వెళ్లడం వల్ల జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు.

* విజయనగరం వి.టి.అగ్రహారంలోని పరిశ్రమల ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం. ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నా అదుపులోకి రాని అగ్ని జ్వాలలు. దట్టమైన పొగ, ఎగసిపడుతున్న మంటలతో భయాందోళన చెందుతున్న పరిసర ఇళ్లలోని ప్రజలు.

* ​​హైదరాబాద్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్దానగర్ 40ఫీట్స్ రోడ్డు లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులకు తీసిన గుంత నేటి వర్షం ధాటికి నిండటంతో ​వైద్యం కోసం వచ్చిన రెండు నెలల పాప వాళ్లు నానమ్మ రొడ్డు గుంతల్లో పడిపోయారు.​గమనించిన స్థానికులు, పాపతో పాటు మహిళను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ​స్థానిక మేయర్, అధికారుల, కాంట్రాక్టు నిర్లక్ష్యం కారణంగా సంఘటన జరిగిందని స్థానికులు మండి పడుతున్నారు. ​ఆ దృశ్యం సీసీటీవీ లో రికార్డ్ అయింది
*