స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను అన్ని పార్టీలూ కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కేంద్రానికి లేఖ రాశారని.. ఆయన కోరిన విధంగానే సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించారన్నారు. తనకు భద్రత ఉంటే తప్ప విధులు నిర్వర్తించలేనని ఎస్‌ఈసీ లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. ఇలాంటి ఒక లేఖ కేంద్ర ప్రభుత్వానికి నిజంగా వెళ్లిందా?లేదా? అనే అంశంపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడిగి తెలుసుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగానే ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేసిందన్నారు. ఇది కేవలం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమే తప్ప ఇందులో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అన్ని పార్టీలూ కోరినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.
మీరు వారిని అడగలేరా?
Related tags :