దక్షిణాది కథానాయిక అమలాపాల్ తన ప్రియుడు భవిందర్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లిలో తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పలువురు అభిమానులు ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు. దర్శకుడు ఎ.ఎల్ విజయ్‌తో విడాకుల తర్వాత తన జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడని అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆయన ఎవరో మాత్రం వెల్లడించలేదు. దీని తర్వాత అమలాపాల్‌తో కలిసి తీసుకున్న ఫొటోలను ముంబయికి చెందిన గాయకుడు భవిందర్ సింగ్ పలు సందర్భాల్లో షేర్ చేశారు. ఆమెను హత్తుకుని ఉన్న ఫొటోను కూడా పంచుకోవడంతో ‘ప్రేమలో ఉన్నారు’ అంటూ వదంతులు మొదలయ్యాయి. అమలాపాల్ ప్రియుడు ఇతడేనా? అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై అమలాపాల్ స్పందించలేదు. ఎట్టకేలకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అమలాపాల్, భవిందర్ సింగ్ ఇంకా పెళ్లి వార్తలపై స్పందించలేదు. 2014లో అమలాపాల్ తమిళ దర్శకుడు ఎ.ఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. 2019 జులైలో విజయ్ రెండో వివాహం చేసుకున్నారు.
ఆనందంగా అమలాపాల్ రెండో వివాహం
Related tags :