WorldWonders

పురుషులకు దుర్వార్త – ప్లేబాయ్ ఆపేస్తున్నారు

Covid19 Affect - Playboy Magazine To Stop Publishing

నగ్నచిత్రాలు, పురుషుల లైఫ్ స్టైల్ కథనాలతో పాపులరైన ‘ప్లేబాయ్’ పత్రిక ఇక చరిత్రగా మిగిలిపోనుంది.

ప్రపంచ రసికులకు పరిచయం అక్కర్లేని పేరు ‘ప్లేబాయ్’. 60వ దశకంలో నగ్న చిత్రాలతో నాటి కుర్రాకారును ఔరా అనిపించిన ఆ పత్రిక తరతరాలుగా తన ఉనికిని చాటుతోంది. లింగబేధం లేకుండా అందరినీ ఆకట్టుకునే ఈ పత్రికకు కరోనా వైరస్ (కోవిడ్ 19) బ్రేకులు వేసింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వల్ల పరిస్థితులు దయనీయంగా మారడంతో పత్రిక అమ్మకాలు ముందుకు సాగవని భావించిన యాజమాన్యం.. కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తాము పత్రిక రూపంలో కనిపించబోమని.. కేవలం డిజిటల్ ఎడిషన్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

అమెరికాలో సుమారు 66 ఏళ్ల నుంచి ఈ ‘ప్లేబాయ్’ నడుస్తోంది. 1960లో సెక్స్ విప్లవాన్ని సృష్టించిన ఈ పత్రిక అతి తక్కువ కాలంలోనే భారీ సంఖ్యలో పాఠకులను సంపాదించుకుంది. ఫ్యాషన్ ప్రపంచానికి ఎంతో మంది మోడల్స్‌ను అందించిన పత్రిక ఇది. అంతేకాదు.. ఎంతో మంది సెలబ్రిటీలు.. ఈ పత్రిక కవర్ పేజ్‌పై ఒక్కసారి కనిపిస్తే చాలు బోలెడంత పాపులర్ కావచ్చని భావించేవారు. కేవలం నగ్న చిత్రాలపైనే ఆధారపడుకుండా పురుషులకు ఉపయోగపడే ఎన్నో లైఫ్‌స్టైల్ కథనాలను ఈ పత్రిక ప్రచురించుంది. అంతేకాదు, ప్లేబాయ్ ఇవెంట్లకు కూడా ఎనలేని ఆధరణ లభించింది.

1970లో ఈ పత్రికకు ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పత్రికకు ఆధారణ తగ్గింది. నగ్న చిత్రాలన్నీ ఇంటర్నెట్‌లోనే లభిస్తుండటంతో పాఠకులు పత్రికను వదిలి డిజిటల్ బాట పట్టారు. దీంతో ‘ప్లేబాయ్’ కూడా డిజిటల్ వైపు అడుగులు వేసింది. 2016లో నగ్న చిత్రాలకు పూర్తిగా స్వస్తిపలికింది. మళ్లీ 2017 నుంచి పాత సాంప్రదాయాన్ని కొనసాగించింది. కరోనా వైరస్ వల్ల ఈ పత్రికకు పనిచేసే క్రియేటివ్ ఎడిటర్లు అందుబాటులో ఉండబోరని, అలాగే ప్రచురణ కూడా కష్టతరం కానుందని భావించిన ప్లేబాయ్ నిర్వాహకులు చివరి ఎడిషన్ ప్రచురించి.. ‘ప్లేబాయ్’ పత్రికి వీడ్కోలు తెలపాలని నిర్ణయించుకుంది. కేవలం ప్రత్యేక ఎడిషన్లు మాత్రమే విడుదల చేయాలని భావిస్తోంది.

ఈ సందర్భంగా ‘ప్లేబాయ్ ఎంటర్‌ప్రైజెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెన్ కాన్ మాట్లాడుతూ.. ‘‘2021 నుంచి డిజిటల్ కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తాం. వినియోగదారుల కోసం సరికొత్త కథనాలు, గ్యాలరీలను అందిస్తాం. ‘ప్లేబాయ్’ ఎడిషన్ల ప్రచురణ మాత్రమే నిలిచిపోతుంది. అయితే, స్పెషల్ ఎడిషన్లు మాత్రం అందుబాటులోనే ఉంటాయి. ప్రింట్‌ను పూర్తిగా విడిచే ప్రస్తక్తే లేదు’’ అని స్పష్టం చేశారు.

Image result for playboy covid19