Kids

నాయినమ్మ చెప్పింది వినాలి. పాటించాలి.

Follow elderly people's suggestions-Telugu Kids Info

ఒరేయ్ అలా మడి ఆచారాలు, శుచి, శుభ్రత లేకుండా ఏంటిరా ఆ అప్రాచ్యపు పనులు

– చెప్పులు ఇంట్లోకి తీసుకు రాకురా.
– బయటి నుండి రాగానే కాళ్ళు కడుక్కొరా
-స్తానం చేసిన తరువాత మాత్రమే తిను
– బయట తిరిగి వచ్చిన తరువాత స్థానం చేసి , వేరే బట్టలు వేసుకొని ఇంట్లోకి రా
– ఉతకని బట్టలు కట్టుకోవద్దు
– ఏదైనా తినే ముందు చేతులు కడుక్కో
– ఎవర్ని బడితే వాళ్ళని తాకి , వాళ్ళు ఎంగిలి చేసినది నువ్వుతినకు
– శాఖాహారం మాత్రమే తిను
– కుక్కల్ని , పిల్లుల్ని అలా ఒళ్ళో కూర్చో బెట్టుకొని ముద్దుచేయకు
– బయట వండినవి , నిన్న వండినవి తినకు , వేడిగా ఉన్నప్పుడే తిను
-మడి కట్టుకొని వండు , నేను వంట చేస్తున్నప్పుడు నన్ను ముట్టుకోవద్దు
– పిల్లల్ని నేరుగా ముద్దాడద్దు
– పాత్రలు ఎండలో బోర్లా పెట్టు
– శవాన్ని ముట్టుకోవద్దు , చనిపోయిన వారి కుటుంబ సభ్యులను రెండు వారాలదాకా ముట్టుకోవద్దు , వారితో తిరగవద్దు

ఒకప్పుడు మన ఇళ్ళల్లో పెద్దలు ఇలా అంటే చాదస్తం అని చిరాకు పడే వాళ్ళం.

“ఇప్పుడు” ప్రపంచం మొత్తానికి చాదస్తం పట్టుకుంది.