రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ నుంచి కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
లేఖపై ఏపీ సీఎస్‌తో కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాట్లాడారని తెలిపారు.
ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్ రాసినట్లుగానే లేఖ వచ్చిందని.. అధికారులపై బెదిరింపులకు పాల్పడటం సరికాదని కిషన్‌రెడ్డి అన్నారు.
ఏపీ సీఎస్‌తో మాట్లాడి ఆయనకు రక్షణ ఇవ్వాలని చెప్పామన్నారు.
వీలైతే ఇవాళ రాష్ట్రానికి లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు.
అధికారులను బెదిరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని.. రమేశ్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో రక్షణలోనే ఉన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఏపీకి వచ్చేటప్పుడు పూర్తి రక్షణ తీసుకోవాలని సీఎస్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు.