వివాహం అనేది జీవితంలో ఒక్కసారి వచ్చే ప్రక్రియ. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని బాగా చేసుకోవాలనుకుంటారు. అయితే, తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవేంటో తెలుసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. దీని వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. అవేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెబుతున్నారు. అలాంటి విషయాలు ఏంటో తెలుసుకోండి..
వివాహ గొప్పదనం ఇదే..
వివాహం.. ప్రతి మతంలోనూ వివాహ తంతు ఉంటుంది. అయితే, ఇందులో భారతీయుల ప్రత్యేకతే వేరని చెప్పాలి.. ఎన్నో విషయాలు వివాహ ప్రక్రియల్లో ఉంటాయి. జీలకర్ర బెల్లం, ఏడడుగులు, తలంబ్రాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. వ్రతాలు, నోములు, పూజలు కూడా ఉంటాయి. వీటి వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు పండితులు. కేవలం సాంప్రదాయపరంగానే కాదు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి.. అవేంటో తెలుసుకోండి..
జీలకర్ర బెల్లం పెట్టడం వెనుక..
వివాహంలో ప్రతి కార్యం కూడా ముఖ్యమే. ఇందులో ఎన్నో కార్యాలు ఉంటాయి. ముఖ్యంగా మన భారతీయ సంపద్రాయంలో.. అయితే, ఇవన్ని కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు జ్యోతిష్కులు. వీటిని చేయడం వెనుక ఎన్నో మంచి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా భారతీయ వివాహ వేడుకలో జీలకర్ర బెల్లం పెడతారు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. దీని గురించి జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే.. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరినొకరు చూసుకోవాలట. ఇలా చేయడం వల్ల వారి మధ్య ప్రేమ పెరుగుతుందట. చాలా మంది దీనిని ఓ తంతులానే చూస్తున్నారని చెబుతున్నారు.
ముహూర్తానికి ప్రాముఖ్యత ఉందా..
ఎవరైనా పెళ్లి విషయంలో ముహూర్తానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా వివాహం అనగానే ముహూర్తం ఎప్పుడు అని అడుగుతారు. అంతటి ప్రాధాన్యత ఉంది ఈ సమయానికి. అయితే, కొన్ని కారణాల వల్ల చాలా మంది అనుకున్న సమయానికి తాళి కట్టలేరు. దీని వల్ల దంపతుల జీవితంలో సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు జ్యోతిష్యులు. ముహూర్త సమయానికి తాళి కట్టకపోవడం వల్ల మనో వైకల్యం, దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం, సంతానం కలగకపోవడం వంటి వి జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు.
కళ్యాణ మంటపంలో చెప్పులు వేసుకుని వస్తే..
అదే విధంగా.. వివాహం జరిగేటప్పుడు నూతన వధూవరులను ఆశీర్వదించడనాకి సాక్షాత్తూ ఆ దేవదేవతలే మంటపానికి తలరివస్తారట. అలాంటప్పుడు మిగతా బంధువులు, సన్నిహితులు కానీ మంటపంలో చెప్పులు వేసుకుని రావడం వల్ల దేవతలకి కోపవం వచ్చి ఆశీర్వదించకుండానే వెళ్లిపోతారట. ఈ కారణంగా వారి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు..
తలంబ్రాలకి బదులు థర్మాకోల్ వాడితే..
వివాహ వేడుకలో మరో
ఘట్టం తలంబ్రాల వేడుక. నూతన వధూవరులు ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు. ఇది ఎంతో ఆనందంగా జరిగే వేడుక అనే చెప్పాలి. అయితే, పూర్వకాలంలో ఇది తలంబ్రాల వరకూ ఉండేది. కానీ, రాను రాను ఫొటోలు, వీడియోల కోసం.. ఇతర కారణాలతో అందరూ కూడా చమ్మీలు, థర్మాకోల్ బాల్స్ పోసుకోవడం ప్రారంభించారు. ఇది ఎప్పటికీ సరికాదని చెబుదున్నారు జ్యోతిష్యులు. ఇలా చేయడం వల్ల బంధు ద్వేషం పెరగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు జ్యోతిష్యులు. ఇలా వివాహ వేడుకలో జరిగే ప్రతి పనికి ఒక్కో కారణం ఉంటుంది. కాబట్టి, దీనిని ప్రతి ఒక్కరూ గమనించి తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని సూచిస్తున్నారు.