Health

భారత రాష్ట్రపతికి కొరోనా పరీక్షలు-TNI కథనాలు

Indian President Ramnath Kovind To Get Tested For Coronavirus

* ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనానై ప్రధాని పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఈ అర్ధరాత్రి నుంచే నిలిపివేయనున్నట్టు చెప్పారు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు.

* కాజీపేట రైల్వేస్టేషన్ లో, సికేంద్రబాద్ నుంచి నిజమెద్దిన్ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో, ఇద్దరు కరోనా వైరస్ అనుమానితులు కోచ్ నెఒబర్ బి.3 దపంతులు. బెడ్ నెఒబర్ 3అండ్7. ఖాజీపేట రైల్వేస్టేషన్ లో తోటి ప్రయాణికులు అనుమానం రావడంతో, ఆందోళన కు దిగి. రైలు చైన్ లాగి రైలు నిలిపివేసిన ప్రయాణికులు. రైలు నిలుపివేసి కరోన వైరస్ అనుమానితులను ఇద్దరిని రైలు నుంచిదించి వరంగల్ ఎంజీఎఒ ఆసుపత్రికి ఐసోలేషన్ వార్డుకు తరలింపు.

* రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కరోనా సోకిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ను కలిసిన బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాష్ట్రపతిని కూడా కలిశారు. కనికా కపూర్ కి పాజిటివ్ అని తేలడంతో అంతా షాక్ అయ్యారు. కనికా కపూర్ ను కలిసిన తర్వాత ఎంపీ దుష్యంత్ సింగ్ రాష్ట్రపతిని కూడా కలిశారు. దీంతో రాష్ట్రపతి రామ్ నాథ్ అలర్ట్ అయ్యారు. తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. ఆయన కరోనా పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని, స్వీయ నిర్బంధం(సెల్ఫ్ క్వారంటైన్) కానున్నారని తెలుస్తోంది.

* హోమ్‌ క్వారంటైన్‌ స్టాంపు ఉన్న వ్యక్తిని రైలులో టీటీ గుర్తించి వెంటనే అప్రమత్తమై పోలీసులకు అప్పగించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో డోర్నకల్‌ వెళ్తుండగా రైల్వే టీటీ గుర్తించారు. ఆలేరు రైల్వేస్టేషన్‌లో దింపి పోలీసులకు అప్పగించారు. కొన్ని రోజుల క్రితం సదరు వ్యక్తి అమెరికా నుంచి వచ్చినట్టు తెలిసింది. క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి ఎక్కాడని తెలియడంతో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లోని వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

* కరోనా ఎఫెక్ట్ కారణంగా కరీంనగర్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. కరీంనగర్‌లో ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుమారు 50వేల మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. 11 మందిని అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఇప్పటివరకూ కరీంనగర్‌లో ఎవరికీ కరోనా పాజిటివ్‌ గుర్తించలేదని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు అనుమానితులను హైదరాబాద్‌కు పంపించామని వెల్లడించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన 70 మందిని అధికారులు గుర్తించారు.

* హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా టులెట్ బోర్డ్ లు మాయమై, కరోనా బోర్డు లు కనిపిస్తున్నాయి.అనుమతి లేనిదే ఎవరూ లోపలికి రాకూడదు, గేట్లు తీయకూడదు అంటూ ఇంటి బైట బోర్డ్ లు పెట్టుకుంటున్నారు యజమానులు.డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసేవారు ఎవరైనా పొరపాటున లోపలికి రావాలని ప్రయత్నిస్తున్నా బైటనుంచే తిప్పి పంపిస్తున్నారు.పనిమీద హైదరాబాద్ వచ్చిన బంధువుల్ని కూడా ఇళ్లలోకి రానీయడంలేదు చాలామంది.

* ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా తిరుమలలో దర్శనాలు నిలిపివేశారు. దీంతో తిరుమల గిరులు ఖాళీ అయ్యాయి. కానీ, శ్రీవారి భక్తులకోసం సిద్ధం చేసిన లడ్డూ నిల్వలు పేరుకుపోయాయి. తిరుమల లడ్డూలకు ఉండే డిమాండ్‌ దృష్ట్యా అదనంగా లడ్డూలు తయారు చేస్తుంటారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా దర్శనాలు నిలిచిపోవడంతో ముందుగా తయారు చేసిన దాదాపు 2లక్షల లడ్డూలు అలాగే ఉండిపోయాయి. ఈ లడ్డూలన్నీ ఉగాది కానుకగా ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయిచింది. భక్తులకు కొండపైకి అనుమతి లేనందున.. తితిదే సిబ్బందికి ఉగాది కానుకగా ఉచితంగా లడ్డూలు ఇవ్వనున్నారు. శ్రీవారి ఆలయానికి భక్తుల రాకను నిలిపివేయడంతో తిరుమలకు వెళ్లే కనుమ మార్గంతో పాటు అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులు, కల్యాణకట్ట, మాఢవీధులు వెంగమాంబ అన్నదాన సత్రం లడ్డూ ప్రసాద కేంద్రాలు వెలవెలబోయాయి. స్వామివారికి నిత్యం చేసే ఆరు కాలాల కైంకర్యాలనూ అర్చకులు నిర్వహిస్తున్నారు.

* ఇటలీలో కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో తాజాగా 627 మంది మరణించారు.. దాంతో మొత్తంగా మరణించిన వారి సంఖ్య 4,032 కు చేరిందని ఇటలీ అధికారులు శుక్రవారం తెలిపారు, ఒక నెల క్రితం ఈ మహమ్మారి ఇటలీలోకి ప్రవేశించిన తరువాత తాజా గణాంకాల ప్రకారం 18.4% మరణాల సంఖ్య పెరిగింది. కరోనా వైరస్ కు నిలయమైన చైనాలో మరణించిన సంఖ్యను గురువారం ఇటలీ అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలను ఇటలీ నమోదు చేసింది.

* కరోనా వైరస్ ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూలు భారీగా మిగిలిపోయాయి. 2.50లక్షల లడ్డూలు మిగిలాయి. దీంతో వాటిని ఉచితంగా పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం దగ్గర శనివారం(మార్చి 21,2020) టీటీడీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు పంపిణీ చేయనున్నారు.

* భారత్‌లో 255కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు..హిమాచల్ ప్రదేశ్‌లో తొలి కరోనా కేసు నమోదు,మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లో కొత్త కేసులు