Videos

Rajini In Wild-[Video]

Rajini In Wild-[Video]

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గొప్పతనమంటే అతిశయోక్తి కాదు. ఎల్లలులేని కథానాయకుడిగా కోట్లాది అభిమానుల ఆదరణ పొందుతున్నప్పటికీ ఓ సామాన్యుడిలా ఉంటారు. నటుడిగా తనకు వచ్చిన ఈ ఖ్యాతిని ఎలా స్వీకరిస్తారని సాహసవీరుడు బేర్‌ గ్రిల్స్‌ అడగగా తలైవా జవాబు చెప్పారు. ‘ఓసారి కట్‌ చెప్పి షూటింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత నేను రజనీకాంత్‌ అనే విషయాన్ని మర్చిపోతా. శివాజీ రావు (హీరో కావడానికి ముందు రజనీ పేరు)గా మారిపోతా. రజనీకాంత్‌ అనేది నా వృత్తి జీవితం మాత్రమే. ఎవరైనా ‘‘మీరు రజనీకాంత్‌’ అని గుర్తు చేస్తే.. ‘హో అవును.. నేను రజనీకాంత్‌’ అనుకుంటా’’ అని తెలిపారు. ఇదే సందర్భంగా రజనీ జీవితం గురించి కూడా బేర్‌ గ్రిల్స్‌ పలు ప్రశ్నలు అడిగారు. 18 ఏళ్ల వయసులో బస్సు కండెక్టర్‌గా పనిచేశానని, ఆపై మద్రాసు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరానని రజనీ చెప్పారు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ తనకు తొలి అవకాశం ఇచ్చారని వివరించారు.