Food

టమాటాతో నలుపు దూరం

Remove Dark Circles With Tomatoes

కళ్ల చుట్టూ నల్లని వలయాలున్నాయా? అయితే ఎక్కువగా టెన్షన్‌ పడకండి.. అందుబాటులో ఉండే.. తరచూ వంటకాల్లో వాడే టమాటాతోనే వలయాల్ని తొలగించుకోవచ్చు. ఇంకో విషయమండోరు.. కేవలం టమాటానే కాదు.. బంగాళదుంప, దోసకాయలతో కూడా తొలగించుకోవచ్చు. అది ఎలాగంటారా?
*టొమాటో – అలోవెరా :
అలోవెరా జెల్‌ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మాన్ని రక్షిస్తుంది. కాబట్టి కంటి చుట్టూ ఎలాంటి నొప్పి, నల్లని వలయాలున్నా ప్రభావవంతంగా తొలగిస్తాయి. టేబల్‌ స్పూను టమాటా పేస్టు, టేబుల్‌ తాజా అలోవెరా జెల్‌ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ వేసి పదిహేను నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే నల్లని వలయాలు తొలగిపోతాయి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే మంచిది.
*టమోటా – బంగాళాదుంపలు :
బంగాళాదుంపలోని ఎంజైమ్‌, కాటెకోలేస్‌ నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. టమాటా గుజ్జు, బంగాళదుంప పేస్టు వేసి కలిపి కళ్ల చుట్టూ వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది..
*టమోటా – దోసకాయ :
దోసకాయ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తొలగించడానికి సహాయపడుతుంది. టమాటా, దోసకాయ పేస్టు కలిపి కళ్ల చుట్టూ రాసుకుని పావు గంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసుకోవచ్చు.