DailyDose

మా కార్యాలయానికి రాకండి-వాణిజ్యం

EPFO Office Requests No Visiting-Telugu Business News Roundup Today

* భవిష్యనిధి (పీఎఫ్‌) చందాదార్లు, పింఛనుదార్లు తమ కార్యాలయాలకు రావొద్దని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. పీఎఫ్‌ ఉపసంహరణకు దరఖాస్తు, నిల్వను తెలుసుకోవడం, చెల్లింపులు చేయడం ఇలా పీఎఫ్‌కు సంబంధించి చాలా సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలకు రాకుండా ఇంట్లో నుంచే ఇటువంటి పనులన్నింటినీ చేసుకోవచ్చని సూచించింది. కరోనా వ్యాప్తిని నియంత్రించే ఉద్దేశంలో భాగంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది.

* కరోనా వైరస్‌ రోగుల కోసం స్టార్‌ హెల్త్‌ ఓ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. కరోనా సోకినట్లు ధ్రువీకరణ జరిగి, హాస్పిటల్‌లో ఉండి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉన్న రోగులు ఈ పాలసీ ద్వారా ప్రయోజనం పొందే వీలుంటుంది. 65 ఏళ్ల వరకు వయస్సున్న వాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. కరోనా తేలినట్లు గుర్తిస్తే చికిత్స నిమిత్తం పాలసీదారునికి ఒకటేసారి బీమా పరిహార మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. ఈ పాలసీలో రెండు రకాల బీమా పరిహార మొత్తాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఒకటి.. రూ.21,000.. రెండోది రూ.42,000. మొదటి రకం పాలసీకి రూ.459 (జీఎస్‌టీ అదనం), రెండో రకం పాలసీకి రూ.918 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

* వ్యాపార, పారిశ్రామిక రంగాల కార్యకలాపాలపై కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో అత్యవసర రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఎస్బీఐ. కోవిడ్‌-19 ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ (సీఈసీఎల్‌) సదుపాయం ద్వారా రూ.200 కోట్ల వరకు రుణాలు అందజేస్తామని ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ప్రకటించింది. జూన్‌ 30 వరకు ఈ రుణాలను పొందే అవకాశం ఉంటుందని తమ అన్ని శాఖలకు ఎస్బీఐ ఓ సర్క్యులర్‌ ఇచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. భారత్‌నూ భయపెడుతున్నది. ఈ అంటువ్యాధి దెబ్బకు వ్యాపార, పారిశ్రామిక రంగాలు కుదేలవుతుండగా, దేశ ఆర్థిక వ్యవస్థ యావత్తూ కుంటుబడుతున్నది. ముఖ్యంగా వ్యాపారులకు నగదు కొరత సమస్య తలెత్తుతున్నది. ఈ క్రమంలో ఎస్బీఐ ఎమర్జన్సీ క్రెడిట్‌ లైన్‌ను ప్రారంభించింది.

* ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. దాదాపు రూ.48వేల కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు మోదీ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. శనివారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. అనంతరం అందు లో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ విలేకరులకు తెలియజేశారు. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీకి ఊతమివ్వడానికి రూ.40,995 కోట్ల ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు చెప్పారు. రాబో యే ఐదేండ్లలో ఈ మేరకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. సంస్థల అమ్మకాలు పెరిగేలా, పెట్టుబడులు పుంజుకునేలా ఈ ప్రోత్సాహకాలు ఉంటాయని వివరించారు. తమ ఈ నిర్ణయంతో 2025 కల్లా తయారీ రంగ ఆదాయ సామ ర్థ్యం రూ.10 లక్షల కోట్లకు చేరవచ్చన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి లభించగలదని అన్నారు. కొత్త కోణా ల్లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ హబ్‌గా భారత్‌ను మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్ల కోసం రూ. 3,762.25 కోట్ల ప్రోత్సా హకాలకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.