DailyDose

కుటుంబంతో కలిసి చప్పట్లు కొట్టిన కేసీఆర్-తాజావార్తలు

KCR Praises All Essential Worker Services Along With Family-Telugu Breaking News

* ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా..కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంతో కృషి చేస్తోన్న వైద్య, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంభసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు.సీఎం కేసీఆర్ దంపతులతోపాటు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చప్పట్లు కొట్టి…వారందరికి సంఘీభావం ప్రకటించారు.

* ఈ నెల 31వరకు తెలంగాణ లాక్ డౌన్నిరుపేదల(27.82లక్షల కుటుంబాల)కు నెల మొత్తానికి సరిపడా రేషన్ బియ్యం పంపిణీ.తెల్ల రేషన్ కార్డున్న వారిలో ఒక్కోక్కరికి 12కేజీలురేషన్ కార్డున్నవారికి రూ.1500ఇస్తాం..ఉద్యోగులు 80%మంది రావాల్సినవసరంలేదు..కానీ మిగిలిన 20% మంది రోటేషన్ పద్ధతిలో రావాలి..అత్యవసర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అందరూ రావాలి.ప్రభుత్వ ఉద్యోగుల విధుల్లో త్వరలోనే క్లారిటీస్తాం..ఎవరు ఇల్లు దాటి బయటకు రావద్దు..అత్యవసర పరిస్థితుల్లో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం..ఎలాంటి పరిస్థితుల్లో ఐదుగురికి మించి గుమిగూడదు..1897చట్టం ప్రకారం ఔట్ సోర్సింగ్, ప్రయివేట్ ఉద్యోగులకు ఈ వారం రోజుల జీతం చెల్లించాలి..వైద్యసేవల్లో అత్యవసర సేవలు తప్పా అన్ని రద్దు..అన్ని రకాల రవాణా సర్వీసులన్నీ రోడ్లపైకి రావద్దు.

* ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిఏపీలో లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం జగన్.ప్రజా రవాణా నిలిపివేస్తున్నాం.నిత్యావసర వస్తువులు మినహా అన్ని షాపులు క్లొజ్ చెయ్యాలి.విదేశాల నుంచి వచ్చిన వారు తక్షణమే సమాచారం ఇవ్వాలి.దేశం మొత్తం కరోనపై యుద్ధం చేస్తుంది.ఏపీ అంతరాష్ట్ర సరిహద్దులు క్లోజ్ చేస్తున్నాం.గోడౌన్లు, ఫ్యాక్టరీలు కార్యాలయాలు పరిమిత సిబ్బందితో నడపాలి.ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలి.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావాలి.విదేశాల నుంచి వచ్చి వారిని గుర్తించేందుకు పోలీసులు దృష్టి పెట్టండి.నిత్యవసర వస్తువుల ధరలను సిద్ధం చెయ్యాలి.అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కేసులు పెడతాం.రోజువారీ కార్మికులు జాగ్రత్తలు పాటించండి.అవసరాలను ఆసరాగా చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవు.

* కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్‌ రైళ్లు, మెట్రో, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్‌ బారిన పడి ఇప్పటికే దేశంలో ఆరుగురు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు అన్ని ప్యాసింజర్‌ సర్వీసులనూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కేవలం గూడ్స్‌ రైళ్లు మాత్రమే నడవనున్నాయని తెలిపింది. అయితే ఇప్పటికే ప్రారంభమైన రైళ్లు మాత్రం వాటి గమ్య స్థానాలను చేరే వరకు అనుమతిస్తామని తెలిపింది.

* కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య భారత్‌లో ఏడుకు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఈ వైరస్‌తో ముగ్గురు మరణించారు. మహారాష్ట్ర, బిహార్‌, గుజరాత్‌లో ఈ మరణాలు సంభవించాయి. మృతిచెందిన వారిలో 38 ఏళ్ల వ్యక్తి ఉండడం గమనార్హం. బిహార్‌కు చెందిన వ్యక్తి (38) ఇటీవలే ఖతార్‌ వెళ్లొచ్చాడు. పట్నాలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. దేశంలో మరణించిన వారిలో పిన్న వయస్కుడు ఇతడే కావడం గమనార్హం.

* కరోనా వైరస్‌తో పోరాడుతున్న బాధితులకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా సేవలందిస్తున్న వైద్యులకు సినీ ప్రముఖులు జేజేలు పలికారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆరు బయటికి వచ్చిన వీరు చప్పట్లు కొట్టారు. వైద్యుల సేవను మెచ్చుకున్నారు. పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, పూరీ జగన్నాథ్‌, ఛార్మి, అనిల్‌ రావిపూడి, తమన్నా, పూజా హెగ్డే, రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, అక్షయ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌ తదితరులు చప్పట్లు కొట్టారు. వీరంతా తమ తమ వీడియోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. కరోనాతో పోరాడుతున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా, పోలీసులకు సెల్యూట్‌ అంటూ వీరు పోస్ట్‌లు చేశారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్‌ రైళ్లు, మెట్రో, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్‌ బారిన పడి ఇప్పటికే దేశంలో ఆరుగురు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు అన్ని ప్యాసింజర్‌ సర్వీసులనూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కేవలం గూడ్స్‌ రైళ్లు మాత్రమే నడవనున్నాయని తెలిపింది. అయితే ఇప్పటికే ప్రారంభమైన రైళ్లు మాత్రం వాటి గమ్య స్థానాలను చేరే వరకు అనుమతిస్తామని తెలిపింది.

* ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా కుటుంబసభ్యులతో కలిసి తానూ ఇంట్లోనే ఉన్నానని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఏం కాదనే ధోరణి వద్దు.. ఇలాంటి ధోరణి వల్లే చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎలా వణికి పోతున్నాయో చూస్తున్నాం. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం మన ఇంట్లోనే ఉందాం- మన కుటుంబాన్ని, మన రాష్టాన్ని, మన దేశాన్ని రక్షించుకుందాం. మన ఇంట్లో మనం ఉందాం.. కరోనాను ఖతం చేద్దాం’ అని హరీశ్‌రావు వీడియో సందేశం ఇచ్చారు.

* కరోనా వైరస్‌కు కళ్లెం వేసేందుకు ప్రధాని మోదీ విధించిన జనతా కర్ఫ్యూను అందరూ పాటించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆయన తన ఇంటికే పరిమితమై కుటుంబంతో సమయం గడుపుతున్నారు. మనవడు దేవాన్ష్‌తో కలిసి పుస్తకం చదువుతున్న వీడియోను చంద్రబాబు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘దేవాన్ష్‌ పుస్తకం చదువుతూ జనతా కర్ఫ్యూను ప్రజలు ఎలా పాటిస్తున్నారో గమనిస్తున్నా. ఇది మన భద్రత కోసం.. ఇవాళ ఇళ్లలోనే ఉందాం. కుటుంబంతో కలిసి సమయం గడపండి’ అని ట్వీట్‌ చేశారు.

* రోజురోజూకీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆదివారం దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ను చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం స్వచ్ఛందంగా కర్ఫ్యూలో భాగమైంది. దీంతో ఎప్పుడూ జనసమూహంతో ఉండే పలు నగరాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్ని డిపోలకే పరిమితమవడంతో జాతీయ రహదారులు బోసిపోయాయి. ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇళ్లకు పరిమితమయ్యారు.

* కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ విధించిన జనతా కర్ఫ్యూపై బాలీవుడ్‌ గాయని మాలినీ అవస్థీ పాట పాడారు. దీన్ని మోదీ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా కృషి చేస్తున్నారు. గాయని మాలినీ అవస్థీ తనదైన శైలిలో ప్రజల్లో అవగాహన కల్పించి, స్ఫూర్తి నింపుతున్నారు’ అని ట్వీట్‌ చేశారు.
* విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారంతా తమ వివరాలను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖకు అందించాలని.. లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ హెచ్చరించారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రజలు పూర్తి సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువగా కొవిడ్ లక్షణాలు బయట పడుతున్నాయని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఆరోగ్యశాఖకు విధిగా తమ సమాచారం అందించేలా వారి కుటుంబసభ్యులు సహకరించాలని కోరారు.

* కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో వైద్యం అందుకుంటోన్న ప్రముఖ బాలీవుడ్‌ గాయని గురించి వైద్యులు స్పందించారు. సదరు గాయని ఓ స్టార్‌లా కాకుండా కరోనా పేషెంట్‌గా ప్రవర్తించడం నేర్చుకోవాలని వారు సూచించారు. ఈ మేరకు గాయనికి చికిత్సనందిస్తున్న లక్నోలోని ఆస్పత్రి బృందం తాజాగా ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ‘సాధ్యమైనంతవరకూ ఆస్పత్రిలో ఉన్న ఉత్తమమైన సౌకర్యాలను గాయనికి అందిస్తున్నాం. ముఖ్యంగా ఆమె కరోనా బాధితురాలిగా మాకు సహకరించాలి. అంతేకానీ మా మీద విమర్శనాస్త్రాలు విసరకూడదు.’ అని ఆ పత్రికా ప్రకటనలో ఆస్పత్రి బృందం పేర్కొంది.

* కష్టం వచ్చినప్పుడు అందరూ ఏకం కావాలి.. మనం సమాజం నుంచి ఎదిగాం.. పరోక్షంగా మన ఎదుగుదలలో సమాజం ఎంతో సహకరించింది.. ఈ విషయాలను గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా కరోనా వైరస్‌పై పోరాటంలో తమ వంతు సాయం చేస్తున్నారు. డబ్బున్నవారు నిర్బంధంలో ఉన్నా, వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.. కానీ, రోజువారీ కూలీ పనులు చేసే పేదలు.. చిరు ఉద్యోగులు.. నెల ఖర్చుల్లో కొంచెం తేడా వచ్చినా అతలాకుతలమైపోయే కుటుంబాలెన్నో ఈ వైరస్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కేవలం ప్రాణాలు దక్కితే చాలు అన్న భయంతో కష్టాలను దిగమింగుకొని జీవిస్తున్నారు. మరోపక్క ఈ క్రమంలో కొందరు బిలియనీర్లు తమ సంపదలో కొంత మొత్తం ఆరోగ్యసేవలను మెరుగు పర్చేందుకు విరాళంగా ఇస్తూ ప్రభుత్వాలకు అండగా ఉంటున్నారు.

* ఛత్తీస్‌గఢ్‌ అడవులు మరోసారి రక్తమోడాయి. సుక్మా జిల్లాలో నక్సల్స్‌కు, భద్రతా బలగాలకు శనివారం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో అదృశ్యమైన 17 మంది మృతదేహాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. మృతదేహాలను అడవుల నుంచి తరలించినట్లు ఐజీ (బస్తర్‌రేంజ్‌) సుందర్‌ రాజ్‌ తెలిపారు. నక్సలైట్లు పెద్ద ఎత్తున గుమిగూడారన్న సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది శనివారం ఎల్మగుండ ప్రాంతంలో వద్ద మూడు వైపుల నుంచి మోహరించారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌), సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా దళాలు పాల్గొన్నాయి.

* అర్జెంటీనా ఆటగాడు‌, జువెంటస్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ సభ్యుడు పౌలో డైబాల కరోనాతో బాధపడుతున్నాడు. కరోనా పరీక్షల ఫలితాల్లో తనకు, తన ప్రేయసి ఒరియానాకు పాజిటివ్‌గా తేలిందని ట్విటర్‌లో వెల్లడించాడు. ప్రస్తుతం తామిద్దరం ఆరోగ్యంగానే ఉన్నామని, తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు చెప్పాడు. జువెంటస్‌ క్లబ్‌లో.. పౌలో కన్నా ముందు బ్లెయిసె మాటుడి, డానియల్‌ రుగాని అనే ఇద్దరు ఆటగాళ్లు ఈ వైరస్‌బారిన పడ్డారు.

* కరోనా వైరస్‌కు కళ్లెం వేసేందుకు ప్రధాని మోదీ విధించిన జనతా కర్ఫ్యూను అందరూ పాటించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆయన తన ఇంటికే పరిమితమై కుటుంబంతో సమయం గడుపుతున్నారు. మనవడు దేవాన్ష్‌తో కలిసి పుస్తకం చదువుతున్న వీడియోను చంద్రబాబు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘దేవాన్ష్‌ పుస్తకం చదువుతూ జనతా కర్ఫ్యూను ప్రజలు ఎలా పాటిస్తున్నారో గమనిస్తున్నా. ఇది మన భద్రత కోసం.. ఇవాళ ఇళ్లలోనే ఉందాం. కుటుంబంతో కలిసి సమయం గడపండి’ అని ట్వీట్‌ చేశారు.

Image result for kcr applauds