కొరోనా నివారక చర్యల్లో భాగంగా మలేషియా, ఇండియాల్లో విమానాశ్రయాలు మూసివేయడంతో కౌలాలాంపూర్ విమానాశ్రయంలో భారతీయులు పెద్దసంఖ్యలో చిక్కుకున్నారు. 400మందికి పైగా ఉన్న ఈ ప్రవాసుల్లో తెలుగువారు అధికంగా ఉన్నారు. వీరికి భోజనం, వసతి, రవాణా వంటి సౌకర్యాలను మలేషియా తెలుగు ఫౌండేషన్ (MTF) సంస్థ అందజేసింది. వీరి సహకారానికి మలేషియాలోని ఇండియన్ హైకమీషన్ అధ్యక్షుడు కాంతారావుకి ధన్యవాదాలు తెలిపింది. సహాయ ఏర్పాట్లను కమిటీ సభ్యులు జనరల్ సెక్రటరీ ప్రకాష్ రావు , ట్రేసరర్ స్రీన్ జివి,జగదీష్ రావు తదితరులు పర్యవేక్షించారు.
మలేషియాలో చిక్కుకున్న భారతీయులకు MTF అండ
Related tags :