ScienceAndTech

మీ సెల్‌ఫోన్లు శుభ్రం చేస్తున్నారా?

Are you cleaning your mobile phones?

కరోనా బారినపడకుండా ఉండడం కోసం శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. మాస్క్‌లు ధరిస్తున్నారు. పదే పదే ముఖంపై చేతులు పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ పదే పదే ఉపయోగించే మీ ఫోన్‌ సంగతేంటి? కరోనాకు చెక్‌ పెట్టాలంటే ఫోన్‌ను శానిటైజ్‌ చేసుకోవాలి అంటున్నారు డాక్టర్లు.
ఈ ఆఫీసులో డెస్క్‌పై, కంప్యూటర్స్‌పై ఎక్కడ పడితే అక్కడ ఫోన్‌ పెడుతూ ఉంటారు. కరోనా వ్యాప్తి చెందడానికి ఫోన్‌ కూడా కారణం కావచ్చు.
ఈ విషయాన్ని డాక్టర్లు సైతం గుర్తు చేస్తున్నారు. అందుకే చేతులు మాత్రమే శుభ్రం చేసుకోవడం కాకుండా, ఫోన్‌ను సైతం శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.ఈ ఒక వ్యక్తి సగటున ఒక రోజులో 2600 సార్లు ఫోన్‌ ముట్టుకుంటున్నాడు. అధ్యయనంలో భాగంగా 94 మందిని పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ కరోనా వేగంగా విస్తరించడానికి ఫోన్‌ కూా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.ఈ ఫోన్‌పై ఒక చదరపు అంగుళం విస్తీర్ణంలో సుమారు 25 వేల బ్యాక్టీరియా ఉంటుందట. ఈ సంఖ్య టాయిలెట్‌ సీట్‌పై ఉండే క్రిముల కన్నా ఎక్కువట.ఈ స్మార్ట్‌ఫోన్‌ స్ర్కీన్‌పై వైరస్‌ 96 గంటలపాటు సజీవంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఫోన్‌ ఉపయోగిస్తున్న వారి ఆరోగ్యంపైనే కాకుండా, ఇతర ప్రదేశాలకు విస్తరించడానికి కారణమవుతోంది.ఈ చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నట్టుగానే ఫోన్‌ను శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్‌ తయారుచేసుకోవాలి.ఈ ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌ను ఫోన్‌ శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. అయితే దీనివల్ల ఫోన్‌ దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలిపిన ద్రావణాన్ని ఫోన్‌ శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.
ఈ 70 శాతం ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌ కూడా వాడొచ్చు. క్లోరోక్స్‌ వైప్స్‌నూ ఉపయోగించవచ్చని ఆపిల్‌ కంపెనీ తెలిపింది.ఈ ఫోన్‌ను శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్‌ క్లాత్‌ను ఉపయోగించాలి.ఈ ఫోన్‌ను శుభ్రం చేసేటప్పుడు ఛార్జింగ్‌లో పెట్టవద్దు.ఈ ఫోన్‌కు ఉన్న ప్రొటెక్టింగ్‌ కవుర్లను తొలగించాలి.ఈ శానిటైజర్‌ను నేరుగా ఫోన్‌పై స్ర్పే చేయడం సరైన పద్ధతి కాదు. వస్త్రంపై ద్రావణాన్ని స్ర్పే చేసి నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. ప్రొటెక్టింగ్‌ కవర్‌ను కూడా శుభ్రం చేయాలి. తరువాత కాసేపు ఆరనివ్వాలి.ఈ పవర్‌బ్యాంక్‌, ఇయర్‌ఫోన్స్‌ను సైతం శానిటైజ్‌ చేసుకోవడం మరువద్దు.

Image result for corona cell phone