Fashion

గోళ్ల రంగుతో వాంతులు వస్తున్నాయా?

Are you experiencing nausea with nail polish-Telugu fashion news

స్నేహితురాళ్లతో కలిసి సినిమాకు వెళ్లడానికి తయారవుతోంది ప్రత్యూష. పచ్చ రంగు లెహెంగాకు మ్యాచ్‌ అయ్యే జుంకాలు పెట్టుకుని అదేరంగు గాజులూ, గోళ్లరంగునూ వేసుకుంది.

ఒకప్పుడు పండుగలు, వేడుకలు జరిగేటప్పుడు గోరింటాకు పెట్టుకునేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సమయం లేకపోవడం, సులువుగా అందుబాటులో ఉండటం వల్ల చాలామంది గోళ్లరంగే వేసుకుంటున్నారు. వీటిల్లో మంచివేవో, హానికలిగించేవి ఏవో తెలుసుకుందాం…

ఎన్నెన్నో సమస్యలు…

నెయిల్‌పాలిష్‌లో ఉండే రసాయనాల వల్ల చర్మం, కళ్ల సమస్యలు రావొచ్ఛు తల తిరగడం, వాంతి వచ్చేట్లు కావడం జరుగుతుంది. గర్భిణులు దీన్ని ఎక్కువగా వాసన చూస్తే… పుట్టబోయే పిల్లలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కారణం దీనిలో టాల్యూయిన్‌, ఫార్మాల్డిహైడ్‌, ఎసిటోన్‌ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని పొడిబారుస్తాయి. వీటితో తలనొప్పి, కళ్లు, గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఏది మంచిది….

ఎలాంటి దుష్ప్రభావాలూ లేనివి వాడాలంటే.. ఫార్మాల్డిహైడ్‌, టాల్యాయిన్‌ లేనివాటిని ఎంచుకోవాలి. పారాబెన్స్‌, క్యాంఫర్‌ తక్కువగా ఉన్నవాటిని ఎంచుకోవాలి. బ్రాండెడ్‌ గోళ్ల రంగులో… సహజసిద్ధ నూనెలు, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌, విటమిన్‌ ఇ, వైల్డ్‌ రోజ్‌ బొటానికల్‌ ఎక్‌స్ట్రాట్‌ ఉంటాయి. వీటివల్ల జరిగే నష్టం తక్కువగా ఉంటుంది.

దేనికి నష్టం….

నెయిల్‌పాలిష్‌ వల్ల గోళ్లకింద చర్మానికి ఎక్కువగా నష్టం జరుగుతుంది. గోళ్లు పసుపు రంగులోకి మారడం, పుచ్చిపోవడం… వంటివి జరిగితే తగ్గడానికి కొన్ని నెలలు పట్టొచ్ఛు రంగును నిరంతరం వాడకూడదు. ఎరుపు రంగు వల్ల మరీ ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇది గోళ్లను మెత్తగా చేస్తుంది. దీంతో అవి తొందరగా పసుపు రంగులోకి మారిపోతాయి.

అప్పుడు మరీ జాగ్రత్త…

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోళ్లరంగు వేసుకోకపోవడమే మంచిది. ఈ కాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంది. అలాగే రంగును తుడిచిన వెంటనే గోళ్లు రంగు మారినా, వాచినా, రక్తం కారినా, గోరు ఊడిపోయినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

సెలూన్‌లో పనిచేసేవాళ్లకు దీనివల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఎక్కువ. చర్మం పొడిబారటం, తలనొప్పి, కంటి, గొంతు సమస్యలు రావొచ్ఛు అరుదుగా మూత్రపిండాలు, కాలేయానికి కూడా ఇబ్బందులు రావొచ్ఛు

శుభ్రంగా ఉంచుకోవాలి

గోళ్లను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. వేళ్ల చివర రోజూ నూనెతో మర్దన చేయాలి. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి. గోళ్లు మరీ బలహీనంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించి విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకోవాలి. గోళ్లు కొరికే అలవాటు పూర్తిగా మానేయాలి.

చిట్కాలు

నాణ్యమైన గోళ్లరంగును మాత్రమే వాడాలి. మధ్యలో కొన్నాళ్లపాటు విరామం ఇవ్వాలి. నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌తోనే శుభ్రం చేసుకోవాలి. పదునైన వస్తువులతో రంగును గీరకూడదు.

Image result for NAUSEA WITH NAIL POLISH