Health

కొత్తగూడెం DSPపై కొరోనా కేసు నమోదు-TNI కథనాలు

Corona Case Lodged On Kothagudem DSP

* కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న తరుణంలో బాధ్యతగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడిని కొత్తగూడెం డీఎస్పీ క్వారైంటన్‌లో పెట్టకుండా తీసుకెళ్లాడు. దీంతో అతనిపై 1897 అంటువ్యాధుల నిర్మూ‍లన చట్టం కింద కేసు నమోదైంది. అయితే, లండన్‌ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో కొత్తగూడెం పోలీసు యంత్రాంగంలో కలవరం మొదలైంది. డీఎస్పీతో సహా అతని కుంటుంబాన్ని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు వరంగల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, డీఎస్పీ కుంటుంబం ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది.సర్కార్ కొరడా..క్వారంటైన్‌లో ఉండకుండా తప్పించుకు తిరుగుతున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లఘించిన 60 మందిపై 1897 ఎపిడెమిక్‌ డిజీజ్‌ యాక్ట్‌ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి ఇళ్లనుంని బయటికి వచ్చే వారిని ఉపేక్షించొద్దని స్పష్టం చేసింది.

* * ఇతర దేశాల నుంచి ఇండియా కు కొరొనా వచ్చింది.* ఇప్పటి వరకు కొరొనా తో తెలంగాణ లో ఎవ్వరు మరణించలేదు- వెంటిలేటర్ మీద లేదు.* మరో రెండు మూడు రోజుల తరువాత డిచార్జ్ లు మొదలు అవుతాయి.* కొరొనా సోకిన తరువాత క్యూర్ చేయడం కష్టం.* దేశంలో తెలంగాణ రాష్ట్రం కొరొనా నివారణ చర్యల్లో మొదటి స్థానంలో ఉన్నాము.* వైరస్ 31 వరకు ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి.* ప్రాణాలు ఉంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు.* ఇప్పటి వరకు సికింద్రాబాద్ ఒక వ్యక్తికి-కరీంనగర్ ఒక వ్యక్తికి మాత్రమే లోకల్ కేసులు నమోదు అయ్యాయి.* కొరొనా నివారణకు వ్యాక్సిన్-మందు లేదు.* కరెంటాయిన్ లో ఉన్న వాళ్ళు అందరూ ప్రభుత్వానికి సహకరీంచాలి.* హోమ్ కరెంటైన్ లో ఉన్న వాళ్ళు బయట తిరగొద్దు.

* తెలుగు రాష్ట్రాలలో లొక్డౌన్ ను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవన్నా పోలీసులురోడ్లపైకి వస్తున్న జనాలను వెన్నకి పంపిస్తున్న పోలీసులుఇప్పటికే ఆటోలను ఆపేస్తున్న పోలీసులుప్యాసింజర్లను దింపేసి కౌన్సిలింగ్ యిస్తున్న పోలీసులుమధ్యాహ్నం నుండి లొక్డౌన్ సిరీస్గా అమలు

* పెరోల్‌పై విడుదలయ్యే ఖైదీల తరగతిని నిర్ణయించడానికి ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాల్సి అన్ని రాష్ర్టాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సుప్రీం ఈ ఆదేశాలను జారీ చేసింది.నాలుగు నుంచి ఆరు వారాలకు పెరోల్‌పై పంపించదగ్గ వారిని గుర్తించాల్సిందిగా పేర్కొంది.దోషులుగా తేలిన వారికి అదేవిధంగా ఏడు సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో జైలు అధికారుల సూచనల మేరకు పెరోల్‌ను మంజూరు చేయొచ్చని తెలిపింది.చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఏ. బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.ఈ ఉన్నతస్థాయి కమిటీ రాష్ట్ర లీగర్‌ సర్వీసెస్‌ అథారిటీతో ఖైదీల విడుదలకు సంప్రదింపులు జరిపనుందన్నారు.కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జైళ్లలో అధిక సంఖ్యలో ఖైదీలు ఉండటం మంచిది కాదన్న థృక్పదంతో సుప్రీం ఈ తీర్పును ప్రకటించింది

* నిబంధనల ఉల్లంగిస్తున్న అంబులెన్స్ యజమానులు.హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రయాణికుల తరలింపులు..ఒక్కో ప్రయాణికుడు నుండి వెయ్యి వసూలు.. అంబులెన్స్ కావడంతో క్లీయరెన్స్ ఇస్తున్న పోలీసులు

* లండన్ నుంచి వచ్చి, కరోనా వైరస్ బారిన పడ్డ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కుటుంబీకులు వైద్య శాఖ అధికారులు తమను నీచంగా చూశారని సంచలన ఆరోపణలు చేశారు. కనిక వయసు 41 సంవత్సరాలు కాగా, మెడికల్ రిపోర్టులో 28 అని రాశారని, ఆమెను పురుషునిగా పేర్కొన్నారని ఆరోపించారు.
అసలు కనిక వైద్య పరీక్షల రిపోర్టు మీడియా ముందుకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వైరస్ బారిన పడిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతూ, కనిక వివరాలు ఎందుకు బహిర్గతం చేశారని మండిపడ్డారు. ఇప్పటికే తాము సమాజంలో పలు అవమానాలకు గురవుతున్నామని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

* ఇండియాలో కరోనా కేసుల సంఖ్య క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతూనే ఉంది. కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ చేస్తున్నాయి. గతకొద్ది రోజుల వరకు పెద్దగా మనదేశంలో కరోనా ఎఫెక్ట్ కనిపించలేదు. అయితే గడిచిన రెండు రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.

* తెలంగాణలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే మూడు కొత్త కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఇద్దరు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా,, మరొకరు కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా వైద్యులు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 30కి చేరింది. కాగా వైరస్‌ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో మఖ్యమంత్రి కేసీఆర్‌ పరిస్థితిని ఎ‍ప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా లాక్‌డౌన్‌ పాటించాలని కోరుతున్నారు. మరోవైపు రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించవద్దని హెచ్చరిస్తున్నారు