సుగంధ ద్రవ్యాల్లో రాణిగా చెప్పుకునే యాలక్కాయి జింగీబెరాసెరు జాతి మొక్క. ఇవి ఇండియా, భూటాన్, నేపాల్, ఇండోనేసియాల్లో లభిస్తాయి. యాలకులు అనగానే మనకు స్వీట్స్ గుర్తొస్తాయి. అయితే స్వీట్స్‌లోనే కాక, బిర్యానీ లాంటి హాట్ డిషెస్‌లోనూ ఉపయోగించే మసాలా దినుసుగా ప్రత్యేకత ఉంది దీనికి. దేనిలో ఉపయోగించినా సువాసన కోసమే ముఖ్యంగా ఉపయోగిస్తామనుకుంటాం. కానీ దీనిలో చాలా ఔషధ గుణాలున్నాయి. యాలకుల్లో ఉండే మాంగనీసు చక్కెర స్థాయిని క్రమపరుస్తుంది. అందుకే స్వీట్స్‌లో దీనిని వాడతాం. యాలకుల్లో ఉన్న మరిన్ని ఆరోగ్య, ఔషధ గుణాలను మనం తెలుసుకుందాం.జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. భోజనానంతరం ఒక ఇలాచీ నమిలి మింగితే కడుపుబ్బరం, గ్యాస్ ప్రాబ్లమ్ వంటివి తగ్గుతాయి.మూడు యాలకులు పై పొట్టు తీసి, గింజల్ని ఒక గ్లాసు నీటిలో రాత్రిపూట నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున తాగితే క్రమేపీ బరువు తగ్గుతారు. ఆ గింజల్ని పొడి చేసి, ఒక గ్లాసు పాలతోనూ తీసుకోవచ్చు. అయితే అవి (నీటితోగానీ, పాలతోగానీ) తాగిన తరువాత గంట వరకూ ఏమీ తినకూడదు.ఉదయాన్నే తీసుకునే టీలో ఒక యాలక్కాయ పొడివేసి, తీసుకుంటే కడుపుబ్బరం, కడుపులో వికారం లాంటివి తగ్గుతాయి.
*టెన్షన్ పరార్ :
యాలకుల రుచి, వాసన మనలో టెన్షన్, హార్ట్ ఫెయిల్యూర్, ఉద్రేకతలను తగ్గిస్తాయి. అందుకే యాలకు టీ గానీ, పాలుగానీ తాగితే డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు.బీపీని తగ్గిస్తాయి : స్పూన్ కొత్తిమీర రసంలో చిటికెడు యాలకుపొడి కలిపి, రోజూ తీసుకుంటూ ఉంటే అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా ఉపయోగపడతాయి.
*ఆస్తమాకి విరుగుడు :
కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్టు ఉండటం వంటి సమస్యలు యాలకుల్ని రెగ్యులర్‌గా వాడితే రక్త ప్రసరణను తేలిక చేసి, ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ యాలకులు ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలను నయం చేస్తాయి.యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాక, క్యాన్సర్ లాంటి వ్యాధుల్నీ అడ్డుకోగలవు. క్యాన్సర్‌ను సహజ సిద్ధంగా తగ్గించే గుణాలు యాలకులకు ఉన్నాయి. క్యాన్సర్‌ను అడ్డుకోవడం, అది వస్తే, త్వరగా పెరగకుండా చెయ్యగలగడం, ఒక్కోసారి క్యాన్సర్‌ను తగ్గించే లక్షణాలూ యాలకులకు ఉన్నాయి.
*డయాబెటిస్‌కి సరైన ట్రీట్‌మెంట్ :
యాలకుల్లో మాంగనీస్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ రిస్క్ నుంచీ కాపాడుతుంది.
గుండెను కాపాడతాయి : యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండెకు మేలు చేస్తాయి. వీటిలోని ఫైబర్, ఇతర పోషకాలు కొలెస్ట్రాల్ లెవెల్‌ను తగ్గిస్తాయి. గుండెకు చక్కగా రక్తం సరఫరా అయ్యేలా చేస్తాయి.
ఒత్తిడిని చితక్కొట్టే యాలుకులు
Related tags :