Kids

మీ బుడ్డోళ్లు పళ్లు తోమట్లేదా?

How to get your kids to get their teeth brushed?

బుజ్జాయిలకు బ్రష్‌ చేయించడం అంత తేలికేం కాదు. బ్రష్‌ను చూడగానే వచ్చీరాని నడకతో అటూ ఇటూ పారిపోతుంటారు. లేదా అసలు బ్రష్‌ నోట్లో పెట్టకముందే ఏడుపు మొదలుపెడతారు. అలాని వదిలేస్తామా? ఏదో మాయచేసి నోటిని శుభ్రంచేస్తేనే కదా.. భవిష్యత్తులో ఎలాంటి దంత సమస్యలూ రాకుండా ఉంటాయి..
* నోటి దుర్వాసన, పంటి నొప్పి లాంటి సమస్యలు తలెత్తకుండా చిన్నప్పటి నుంచే రెండు పూటలా బ్రష్‌ చేయించాలి.
* పిల్లలకు ఏ వయసు నుంచి బ్రష్‌ చేయించాలనే సందేహం వస్తుంది చాలామందికి. ఏడాది నుంచే శుభ్రం చేయడం మొదలుపెట్టాలి.
* మామూలు బ్రష్‌లు వాళ్ల నోటికి పెద్దవవుతాయి. పైగా కుచ్చులు కూడా గరుకుగా ఉండి నోటికి గాయం చేస్తాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా తక్కువ పొడవుతో చూపుడువేలికి తొడుక్కునే బ్రష్‌లు లభిస్తున్నాయి. వాటిని వినియోగించడం మంచిది.
* కొంతమంది పిల్లలు నోట్లో బ్రష్‌ పెట్టుకుని చాలాసేపు నములుతూనే ఉంటారు. వారికి అదో ఆటలా మారిపోతుంది. బ్రష్‌ని ఎక్కువసేపు నోటిలో ఉంచుకోకుండా చూడాలి.
* బ్రష్‌ను ముందుగా వేడి నీళ్లతో శుభ్రం చేసి ఆ తర్వాతే ఇవ్వాలి.