కొంత మందికి ఒక సినిమాలో అవకాశం రావడానికే ఏళ్లకేళ్లు పడుతుంది. అలాంటిది కేతికాశర్మకి ఒక సినిమా పూర్తి కాకముందే మరో బంపరాఫర్ తగిలింది. కేతిక ప్రస్తుతం ‘రొమాంటిక్’ లో నటిస్తోంది. ఆకాశ్ పూరి హీరోగా చార్మితో కలిసి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులోని హాట్ స్టిల్స్ ని చూశాక కేతిక గ్లామర్ పై ఓ అంచనాకి వచ్చారు ఫిల్మ్ మేకర్స్. అందుకేనేమో.. ఆ సినిమా రిలీజవ్వకముందే ఆమె మరో సినిమాలో చాన్స్ కొట్టేసింది. నాగశౌర్య హీరోగా సుకుమార్ రైటింగ్స్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో కేతికా శర్మను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాశీ విశాల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ కి వెళ్లనుంది. కాకపోతే కేతిక నిజంగానే సెలెక్టయ్యిందా లేదా అనేది అఫీషియల్ గా తెలియాలి. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం కేతిక రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. ప్రారంభంలోనే ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులు పట్టేస్తోందంటే ఆమె ఇక ఆగదన్నమాటే!
గ్యాప్ లేకుండా…
Related tags :